రోడ్లు ఎక్కడ ఉన్నా, సేఫ్టీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం ఇండియన్ రోడ్లపై నడుస్తున్న వాహనాల గురించి మాట్లాడుతున్నప్పుడు, అవి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నందున, సురక్షితమైన వాహనాన్ని ఎంచుకోవడం మరింత ముఖ్యమైనది. 8 లక్షల బడ్జెట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కారు కావాలంటే, మీకు చాలా బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కార్లు మీ బడ్జెట్ కి సరిపోవడమే కాకుండా, చాలా వరకు సేఫ్టీని అందించి, మీ ప్రయాణాన్ని సులువుగా చేస్తాయి.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
ఈ కారు రూ. 5.92 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూం ధరతో లభిస్తుండగా, ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో అందించబడింది. ఈ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు సిఎన్‍జి ఆప్షన్లలో ఎరా, మాగ్నా, స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్, స్పోర్ట్జ్ మరియు ఆస్టా అనే ఐదు వేరియంట్‌లతో అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ రూ. 6.13 లక్షల ఎక్స్-షోరూం ధరతో వీటి ధరలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందించబడ్డాయి. ఎక్స్‌టర్మోడల్ లో సిఎన్‍జికిట్‌తో కూడిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 82bhp పవర్ మరియు 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ ఆరా
దీని ఎక్స్-షోరూం ధర రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమైంది మరియు ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. మారుతి డిజైర్‌తో పోటీ పడుతున్న ఈ సెడాన్ E, S, SX మరియు SX (O) అనే నాలుగు వేరియంట్‌లలో అందించబడుతోంది.
మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి నుంచి వచ్చిన ఈ పాపులర్ కారు ధర కూడా రూ. 6.49 లక్షల నుండి ప్రారంభం కాగా, ఇందులో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. మే 9, 2024నమారుతి సుజుకి ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. స్విఫ్ట్ కారు LXi, VXi, VXi (O), ZXi మరియు ZXi ప్లస్ 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ i20 కారు
i20 కారు ఎక్స్-షోరూం ధర రూ. 7.04 లక్షల నుండి ప్రారంభమైంది. హ్యుందాయ్ నుంచి అందించబడిన ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కస్టమర్లు ఈ కారును కొత్త అమెజాన్ గ్రే, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్టారీ నైట్ మరియు ఫియరీ రెడ్ అనే ఆరు సింగిల్ కలర్ ఆప్షన్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనిని అట్లాస్ వైట్‌తో బ్లాక్ రూఫ్ మరియు ఫియరీ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ అనే రెండు డ్యూయల్ కలర్ ఆప్షన్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.
మహీంద్రా XUV 3XO
ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీరూ. 7.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూం ధరతో లభిస్తుంది. ప్రస్తుతం చాలా పాపులర్ మోడల్ గా నిలిచిన ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చింది. ఈ కారు లాంచ్ అయిన వెంటనే దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించడం ద్వారా గొప్ప సక్సెస్ ని అందుకుంది. మహీంద్రా నుంచి అందించబడిన ఈ ఎస్‍యూవీకారు అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన ఒక గంటలోపే 50,000 కంటే ఎక్కువ యూనిట్ల బుకింగ్‌లను నమోదు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ఎక్స్-షోరూం ధర రూ. 7.94 లక్షలు కాగా, ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులోఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ మరియు లీడ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
కియా సొనెట్
కియా నుండి వచ్చిన ఈ ఎస్‍యూవీనిరూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ మోడల్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో అందించబడింది. దీని టాప్-స్పెక్ వేరియంట్ (X-లైన్ డీజిల్ ఎటి)ఎక్స్-షోరూంధర రూ. 15.69 లక్షలుగా ఉంది. సౌత్ కొరియన్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ కారును కస్టమర్లు మూడు ఇంజన్లు, 11కలర్లు మరియు ఏడు వేరియంట్‌ల నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు.
టాటా నెక్సాన్
ప్రస్తుతం టాటా నెక్సాన్ కారు రూ. 8 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. సేఫ్టీ కీలకంగా వచ్చిన ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. ఇప్పటి వరకు టాటా నుంచి అందించబడిన కార్లలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కారుగా నిలిచింది. ప్రస్తుతం ఈ మోడల్ 99 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇటీవల, టాటా నెక్సాన్ 7 లక్షల యూనిట్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా, టాటా ఈ మోడల్‌పై లక్ష రూపాయల వరకు భారీ డిస్కౌంట్ ని అందిస్తోంది.
పైన పేర్కొన్నట్లుగా, ఈ కార్లు స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చాయి, ఈ కార్లన్నీ రూ. 8 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలో లభిస్తాయి. వీటిలో చాలా వరకు హ్యుందాయ్ కార్లు ఉన్నాయి, ఎందుకంటే సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని, హ్యుందాయ్ ఇండియా గత ఏడాది అక్టోబర్‌లో #Safetyforall కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీని కింద అన్ని హ్యుందాయ్ కార్లలో ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా అందించబడుతున్నాయి.
ముగింపు
ఈ అన్ని కార్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించబడ్డాయి, మిమ్మల్ని మరియు మీ ఫ్యామిలీని సురక్షితంగా ఉంచడానికి ఈ ఎయిర్‌బ్యాగ్‌లు ఎంతగానో సహాయపడతాయి. మీరు రూ. 8 లక్షల బడ్జెట్‌లో సేఫ్ మరియు బెస్ట్ కారు కోసం చూస్తున్నట్లయితే, ఈ ఆప్షన్లు మీకు బాగా ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇందులోని బెస్ట్ సేఫ్టీ కారును సెలెక్ట్ చేసుకొని మీ జర్నీని ఫ్యామిలీతో పాటుగా ఎంజాయ్ చేయండి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్