మాక్సిమమ్ 650కిమీ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్న సీల్
బివైడి ఇండియా ఎట్టకేలకు ఇండియాలో తన సరికొత్త సెడాన్, సీల్ ధరలను వెల్లడించింది.చైనీస్ ఆటోమేకర్ నుండి వచ్చిన లగ్జరీ ఈవీని రూ. 41 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో, డైనమిక్, ప్రీమియం మరియు పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్‌లలో పొందవచ్చు.ఈ కథనంలో, కొత్త బివైడి సీల్ యొక్క వేరియంట్ వారీగా ఫీచర్లను లిస్ట్ చేసాము.
డైనమిక్ వేరియంట్– రూ. 41 లక్షలు (ఎక్స్-షోరూమ్)
18-ఇంచ్ అల్లాయ్ వీల్స్
విటిఓఎల్ ఫంక్షన్
రీజనరేటివ్ బ్రేకింగ్
360-డిగ్రీ సరౌండ్ కెమెరా
ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్
ఐసోఫిక్స్ మౌంట్స్
ఇంటెలిజెంట్పవర్ సిస్టమ్
ఎలక్ట్రిక్పవర్ స్టీరింగ్
టిసిఎస్, ఈబీడీ, హెచ్ హెచ్ సి, మరియు ఆటో హోల్డ్
ఏడీఏఎస్ లెవల్ 2
పనోరమిక్ గ్లాస్ రూఫ్
ఫ్లష్ డోర్ హ్యాండిల్స్
ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్
ఎలెక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు హీటెడ్ ఒఆర్‍విఎంఎస్
ఫ్రంట్ మరియు రియర్ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డంపింగ్ షాక్ అబ్సార్బర్స్
ఎలక్ట్రానిక్ చైల్డ్ లాక్
ఇంటెల్లిజెన్స్ టార్క్ అడాప్షన్ కంట్రోల్ (ఐటిఎసి)
పవర్‌ట్రెయిన్, బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్
బివైడి సీల్ ని రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో పొందవచ్చు - 61.44kWh మరియు 82.56kWh యూనిట్. డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే, డైనమిక్ వేరియంట్ (ఆర్‍డబ్ల్యూడి) మొదటి బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించి, 510కిమీ క్లెయిమ్ చేసిన రేంజ్ ని అందించగలదు. మరో వైపు, 82.56kWh బ్యాటరీ ప్యాక్ ప్రీమియం మరియు పెర్ఫార్మెన్స్ వేరియంట్ మధ్య షేర్ చేయబడింది. అయితే, మొదటిది 650కిమీ గా డ్రైవింగ్ రేంజ్ అందిస్తుండగా , రెండోది ఎడబ్ల్యూడి వెర్షన్ మరియు ఒకే ఛార్జ్‌పై 580కిమీల క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.