- రెండు బ్యాటరీ ప్యాక్స్ తో మూడు వేరియంట్లలో లభ్యం
- 650 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తున్న సీల్ మోడల్
మొత్తానికి బివైడి ఇండియా ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న సీల్ మోడల్ ని రూ.41 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. e6 మరియు అట్టో3 తర్వాత బ్రాండ్ నుండి వచ్చిన మూడవ ఎలక్ట్రిక్ కారుగా బివైడి సీల్ నిలిచింది. ఇది డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో అందించబడుతుంది. కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ని ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే మరియు కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు ఎక్స్‌టీరియర్ కలర్ల నుండి ఎంచుకోవచ్చు.
లుక్స్ పరంగా, బివైడి సీల్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా మరియు దీని లుక్స్ టెస్లా మోడల్ 3 లాగా అనిపిస్తాయి. ముందుగా చెప్పాలంటే, ఇది స్పోర్ట్స్ కారులాగా డబుల్-U ఫ్లోటింగ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియు ఫ్రంట్ బంపర్ పై యారో-షేప్డ్ ఇన్ సర్ట్స్ కలిగి ఉంది. దీని ప్రొఫైల్ చూస్తే, స్లోపింగ్ గా కనిపించే రూఫ్ లైన్ మరియు ఎలక్ట్రానిక్ ఆపరేట్ చేయడానికి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక వైపు, పొడవైన బానెట్ అంతటా ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ తో కూడిన ఎల్ఈడీ బార్ మరియు డిఫ్యూజర్ దీని లుక్ ని మరింత పెంచుతుంది. అలాగే ఇది 19-ఇంచ్ డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ తో వచ్చింది.
ఫీచర్స్ పరంగా, ఇది ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ లో వస్తున్న కాక్ పిట్ ఇంటెల్లిజెంట్ తో రొటేటింగ్ 15.6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, 10.25-ఇంచ్ ఫుల్ ఎల్‍సీడీ డ్రైవర్స్ డిస్ ప్లే, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్స్ తో వచ్చింది. అదే విధంగా ఇది 360-డిగ్రీ కెమెరా, రెండు వైర్ లెస్ ఫోన్ చార్జర్స్, ఫ్రంట్ పవర్డ్ మరియు వెంటిలేటెడ్ సీట్స్, పనోరమిక్ సన్ రూఫ్, మరియు ఏడీఏఎస్ (అడాస్) సేఫ్టీ సూట్ ఫీచర్లతో వచ్చింది.
బివైడి బ్రాండ్ సీల్ మోడల్ లో 61.44kWh మరియు 82.56kWh అనే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించింది. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ వరుసగా 510 కిలోమీటర్లు మరియు 650కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. 61.44kWh బ్యాటరీ ప్యాక్ 201bhp మరియు 310Nm టార్కును ఉత్పత్తి చేయడానికి మోటారుకు సహాయపడుతుంది. 82.56kWhబ్యాటరీ ప్యాక్ 308bhp మరియు 360Nm టార్కును ఉత్పత్తి చేయడానికి మోటారుకు సహాయపడుతూ రియర్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, స్పోర్టీ పెర్ఫార్మెన్స్ వేరియంట్ 523bhp మరియు 670bhp టార్కును ఉత్పత్తి చేస్తుంది.
వేరియంట్-వారీగా బివైడి సీల్ యొక్క ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
డైనమిక్ | రూ. 41,00,000 |
ప్రీమియం | రూ. 45,55,000 |
పెర్ఫార్మెన్స్ | రూ. 53,00,000 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్