- కొత్త ఆర్కిటెక్చర్ తో వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్
- ఇంటీరియర్ మార్పులలో కొత్త స్టీరింగ్ వీల్ మరియు మరిన్ని ఫీచర్లను అందిస్తున్న మోడల్
బివైడి, అనేది ఒక చైనీస్ కార్ మేకర్. దాని స్వదేశం అయిన చైనాలో సీల్ సెడాన్‌ను అప్‌డేట్ చేసింది. కొత్త అప్‌డేట్‌తో, ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ వేగవంతమైన ఛార్జింగ్, కొత్త ఆర్కిటెక్చర్, ఎక్స్‌టీరియర్ మార్పులు మరియు ఇంటీరియర్ మార్పులను పొందింది.
ముందుగా టెక్ ఫీచర్స్ గూర్చి చెప్పాలంటే, అప్‌డేటెడ్ బివైడి సీల్ కొత్త 800V ఆర్కిటెక్చర్‌తో వచ్చింది. మొదటి ఇటరేషన్ యొక్క 400V సిస్టమ్‌తో రాగా దాని కంటే మెరుగైన ఆర్కిటెక్చర్‌తో ఇది అప్‌గ్రేడ్ చేయబడింది. దీనిని 'ఇ-ప్లాట్‌ఫాం 3.0ఈవో' అని కూడా పిలుస్తారు. ఈ కొత్త ఆర్కిటెక్చర్‌తో, సీల్ మరింత వేగవంతమైన ఛార్జింగ్ ఆప్షన్ ని పొందింది. అలాగే, సంఖ్యల పరంగా చూస్తే మునుపటి ఆర్కిటెక్చర్ 37 నిమిషాల సమయంలో బ్యాటరీ ఛార్జ్ చేయగా, ఇప్పుడు ఈ అప్‌డేటెడ్ బివైడి సీల్ కేవలం 25 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయగలదు. మరోవైపు, అంతర్జాతీయ-స్పెక్ సీల్ లో 61.44kWh మరియు 80.64kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ పూర్తి ఛార్జ్ పై 700కిలోమీటర్లు వరకు క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తాయి.
డిజైన్ పరంగా చూస్తే, కొత్త బివైడి సీల్ కొత్త ఎక్స్‌టీరియర్ పెయింట్, రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ మరియు టెయిల్‌గేట్‌పై కాంట్రాస్టింగ్ బివైడి లోగోతో సహా మరికొన్ని మార్పులను పొందింది. అయితే, అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ లో టెక్ విభాగాన్ని చూస్తే ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా ఉంది. అంతేకాకుండా, ఈ కారు ఇప్పుడు మెరుగైన ఏడీఏఎస్(ఎడాస్) సామర్థ్యాలతో ఇప్పుడు ఈ కారు రూఫ్ పై లిడార్ సెన్సార్‌ను కూడా పొందుతుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, సీల్ సెడాన్ న్యూ ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేయబడిన ఏసీ వెంట్స్ మరియు కొద్దిగా ట్వీక్ చేసిన డాష్‌బోర్డ్ లేఅవుట్‌తో కీలక అప్‌డేట్‌లను పొందింది. ఇప్పుడు అప్‌డేటెడ్ బివైడి సీల్ మార్చి 2024లో ఇండియాలో లాంచ్ అయినందున, ఈ కొత్త వెర్షన్ 2025 నాటికి ఇండియాలో రావచ్చు అని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: రాజపుష్ప