- బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో e6 ఎంపివిని భర్తీ చేయనున్న నయా మోడల్
- రూ. 51,000 టోకెన్ అమౌంట్ తో వీటి బుకింగ్స్ ప్రారంభం
బివైడి ఇండియా దాని కేటగిరిలో సరికొత్త ప్రొడక్ట్ అయిన eMax 7ను రేపే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇదిప్రస్తుత ఆల్-ఎలక్ట్రిక్ ఎంపివిబ్రాండ్ నుండి ఇండియాలో రానున్న మొదటి e6 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అని చెప్పవచ్చు. అలాగే, ఈ మోడల్ ధరలు రేపు, అనగా అక్టోబర్ 8వ తేదీన వెల్లడికానుండగా, ఇప్పటికే దీని బుకింగ్‌లు రూ. 51,000 టోకెన్ అమౌంట్ తో ప్రారంభమయ్యాయి.
e6 నుండి వేరుగా కనిపించేందుకు బివైడి eMax 7 మోడల్ మరింత అనుభవంతో చేసిన డిజైన్ ను పొందింది. ఇందులో షార్ప్ క్రీజ్‌స్, స్లీకర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో రివైజ్డ్ ఫేసియా, హెడ్‌ల్యాంప్స్ ను కనెక్ట్ చేసే సింగిల్ స్లాట్ క్రోమ్, రీవర్క్ చేసిన బంపర్‌తో యాంగులర్ ఎయిర్ డక్ట్‌స్, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరియు కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.
ఇంటీరియర్ మరియు ఫీచర్ల విషయానికొస్తే, eMax 7 పెద్ద 12.8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన లెథెరెట్ సీట్స్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్, మరియు పెద్ద పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి అనేక మార్పులను పొందుతుంది.
ఇంకా చెప్పాలంటే, టీజర్లో చూపించిన ఫోటోల ప్రకారం, eMax 7 రెండవ వరుసలో కెప్టెన్ సీట్లతో 6 సీట్స్ లేఅవుట్‌లో కూడా అందించబడుతుంది. అలాగే, రెండు వెనుక వరుసలలో కూడా రూఫ్-మౌంటెడ్ ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్ మరియు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌లను పొందుతుంది.
పవర్‌ట్రెయిన్, బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలు రేపు లాంచ్ సమయంలో వెల్లడి కానున్నాయి. అంతేకాకుండా, బివైడి eMax 7 ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది కస్టమర్లు డెలివరీ తర్వాత కాంప్లిమెంటరీగా 7kW మరియు 3kW ఛార్జర్‌తో పాటు రూ. 51,000 వరకు బెనిఫిట్ ను పొందుతారు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ఆఫర్‌లు 8వ తేదీ అక్టోబర్, 2024 వరకు చేసిన బుకింగ్‌లపై మరియు 25 మే, 2025లోపు డెలివరీలకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప