- ఇండియాలో మొట్టమొదటి సరిగా వచ్చిన 6సీటర్ మరియు 7సీటర్ ఎలక్ట్రిక్ ఎంపివి
- అందుబాటులో ఉన్న రెండు వేరియంట్స్
బివైడి ఇండియా ఎంపివి eMax 7ను నేడే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది బివైడి నుండి ఇండియాలో మొట్టమొదటి సరిగా వచ్చిన 6సీటర్ మరియు 7సీటర్ ఎలక్ట్రిక్ ఎంపివి కాగా, ఇది సుపీరియర్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్స్ లో అందించబడుతుంది. ఈ మోడల్ రూ. 26.90 లక్షలతో ఎక్స్-షోరూమ్ ధరలు ప్రారంభం కాగా, అలాగే ఎలక్ట్రిక్ ఎంపివి మోడరన్ ఫీచర్లతో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వచ్చింది.
డిజైన్ పరంగా చూస్తే, బివైడి eMax 7 మోడల్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న షార్ప్ క్రీజ్‌స్, స్లీకర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో రివైజ్డ్ ఫేసియా, హెడ్‌ల్యాంప్స్ ను కనెక్ట్ చేసే సింగిల్ స్లాట్ క్రోమ్, రీవర్క్ చేసిన బంపర్‌తో యాంగులర్ ఎయిర్ డక్ట్‌స్, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరియు కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి సరికొత్త డిజైన్ ను పొందింది.
ఇంటీరియర్ మరియు ఫీచర్లు
డ్యాష్‌బోర్డ్ బ్లాక్ మరియు బ్రౌన్ టూ-టోన్ ఇంటీరియర్ కలర్స్ తో మరింత సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
eMax 7 లగ్జరీ మరియు సౌకర్యాన్ని అందించే మరిన్ని ఫీచర్లలో పెద్ద 12.8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన లెథెరెట్ సీట్స్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్, మరియు పెద్ద పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి మరిన్ని కూడా పొందింది.
బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్
బివైడి eMax 7 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో పొందవచ్చు. సుపీరియర్ వేరియంట్ 71.8kWh బ్యాటరీ ప్యాక్‌తో 530కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ని అందించగలదు, ప్రీమియం వేరియంట్ 55.4kWh బ్యాటరీ ప్యాక్‌తో420 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. మరో వైపు, సుపీరియర్ వేరియంట్ కేవలం 8.6సెకన్లలో 0-100కెఎంపిహెచ్ స్ప్రింట్ చేస్తే, ప్రీమియం వేరియంట్ కేవలం 10.1సెకన్లలో 0-100కెఎంపిహెచ్ స్ప్రింట్ చేయగలదు.
వేరియంట్ వారీగా BYD eMax 7 ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
ప్రీమియం వేరియంట్ 6 సీటర్ రూ. 26.90 లక్షలు
ప్రీమియం వేరియంట్ 7 సీటర్ రూ. 27.50 లక్షలు
సుపీరియర్ వేరియంట్ 6 సీటర్ రూ. 29.30 లక్షలు
సుపీరియర్ వేరియంట్ 7 సీటర్ రూ.29.90 లక్షలు
అనువాదించిన వారు: రాజపుష్ప