- కేవలం రూ. 51వేలతో బుకింగ్స్ ప్రారంభం
- అక్టోబర్ 8 వరకు మొదటి 1,000 బుకింగ్‌లకు ప్రత్యేక బెనిఫిట్స్
బివైడిeMAX 7ని అక్టోబర్ 8న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధంగాఉంది. ఇప్పుడు,దాని ధర ప్రకటనకు ముందే, కంపెనీ కేవలం రూ. 51,000 టోకెన్ అమౌట్ తో అప్‌డేటెడ్ ఎంపివి బుకింగ్‌లను ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించింది. అలాగే, e6 ఎంపివికి ఫేస్‌లిఫ్ట్‌గా రానున్న ఈ మోడల్, లోపల గణనీయమైన మార్పులను పొందుతుంది.
బివైడి ప్రకారంగా చూస్తే, కొత్త eMAX 7 స్టాండ్‌ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది కస్టమర్‌లు స్పెషల్ ఆఫర్‌స్ మరియు బెనిఫిట్స్ ను పొందవచ్చు. వీటిలో రూ.51,000 వరకు బెనిఫిట్ మరియు ఈ కారు డెలివరీ సమయంలో కాంప్లిమెంటరీగా 7kW మరియు 3kW ఛార్జర్స్ ను పొందవచ్చు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ఆఫర్‌లు 8వ తేదీ అక్టోబర్ 2024 వరకు చేసిన బుకింగ్‌లపై మరియు 25 మార్చి, 2025లోపు డెలివరీలకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
ముందుగా కాస్మెటిక్ మార్పుల విషయానికొస్తే, కొత్త బివైడి eMAX 7 కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్వీక్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త సింగిల్-స్లాట్ క్రోమ్ గ్రిల్, సరికొత్త అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టైల్‌లైట్‌లపై కొత్త సిగ్నేచర్స్ వంటివి ఉన్నాయి.
రిఫ్రెష్ చేయబడిన ఎంపివి లోపలి భాగంలో, పెద్ద 12.8-ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ మరియు కొత్త స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా, గ్లోబల్ మార్కెట్‌లలో బివైడి M6గా పిలువబడే eMAX 7, 55.4kWh మరియు 71.8kWh బ్యాటరీ యూనిట్లు తో జత చేయబడి ఒక్కొక్క ఎలక్ట్రిక్ మోటారుతో అందుబాటులో ఉంది. ఇండియన్ మార్కెట్ లో అవుట్‌గోయింగ్ కారు 71.7kWh యూనిట్‌ను పొందుతుంది, కాబట్టి ఈ కారు కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్ తో అందించబడుతుందని మేము భావిస్తున్నాం. ఇది వరుసగా 204bhp మరియు 310Nm అవుట్‌పుట్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే, 530కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప