- ఇండియాలో విజయవంతంగా కొనసాగుతున్న E6 ఎంపివి
- పెద్ద బ్యాటరీ ప్యాక్ ని పొందే అవకాశం
ఇండియన్ మార్కెట్లో E6 ఫేస్‍లిఫ్ట్ ని ఎప్పుడు లాంచ్ చేయనుందో వాటి వివరాలను బివైడి కంపెనీ వెల్లడించింది. బ్రాండ్ లోకల్ వెబ్ సైటులో ఈ మోడల్ లిస్టు చేయబడి ఉంది. ఇప్పుడు ఆటోమేకర్ దీనికి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయగా, అందులో E6 ఫేస్‍లిఫ్ట్ కి ఒక కొత్త గుర్తింపును కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఎలా అంటే, E6 ఫేస్‍లిఫ్ట్ పేరును మార్చి, కొత్త పేరుతో దీనిని తీసుకువస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ మార్కెట్లలో E6 ఫేస్‍లిఫ్ట్ ని M6 మోడల్ గా పిలుస్తుండగా, దీనికి ఇండియన్ మార్కెట్లో ఈమ్యాక్స్ 7 కొత్త పేరును తీసుకువచ్చింది. దీంతో, ఇప్పటి నుంచి E6 ఫేస్‍లిఫ్ట్ కారును ఈమ్యాక్స్ 7గా పిలుస్తారు. కంపెనీ ప్రకారం, 'e' అనే అక్షరం ఎలక్ట్రిక్ డ్రైవ్ ని సూచిస్తుండగా, మ్యాక్స్ అనేది ఈ మోడల్ బివైడి E6 కంటే మెరుగైన పెర్ఫార్మెన్స్, రేంజ్, ఫీచర్లతో వస్తున్నట్లు సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇందులో “7” అనే నంబర్ వెహికిల్ గుర్తును సూచిస్తుంది. ఎందుకంటే, ప్రస్తుత జనరేషన్ మోడల్ E6 కారుగా పరిగణించబడింది.
ప్రస్తుతం E6 మోడల్ 71.7kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులో ఉంది. ఇప్పుడు వచ్చే ఈమ్యాక్స్ 7 మోడల్ 71.8kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఇందులో అందించబడే బ్యాటరీ ప్యాక్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, అదనంగా 30 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తూ, మొత్తంగా 530 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది. ఇంకా పవర్ అవుట్ పుట్ విషయానికి వస్తే, 94bhp నుంచి 204bhp వరకు పవర్ మరియు 180Nm నుంచి 310Nm వరకు టార్కును ఉత్పత్తి చేస్తుంది. డిజైన్ మరియు ఇంటీరియర్ వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలను మేము వెబ్ సైటులో అందించాము, వాటిని మీరు మా వెబ్ సైటును సందర్శించి, చదువగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్