- ఇతర అప్‌డేట్‌లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్‌ని కూడా పొందే అవకాశం
- ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో 71.8kWh బ్యాటరీ ప్యాక్‌తో ఆధారితం మరియు 530కిలోమీటర్లు క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తున్న మోడల్
చైనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ బివైడి ఈ సంవత్సరం ప్రారంభంలో e6 ఎంపివి ను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఈ మోడల్ ఇండియన్ మార్కెట్‌లో అధికారికంగా టీజ్ చేయబడింది. ఈ కారు పవర్‌ట్రెయిన్‌లో మార్పులు పొందింది ఈ చిన్న మార్పు మాత్రమే కాకుండా, రివైజ్డ్ డిజైన్ మరియు అనేక కొత్త ఫీచర్లను పొందుతుంది.
దీనికి గ్లోబల్ మార్కెట్లలో M6 అనే పేరు ఉంది. ఇది ఒకే విధమైన మూడు అక్షరాల పేరును కలిగి ఉంది. అలాగే, ఇందులో కాస్మెటిక్ వివరాలు చూస్తే, కొత్త e6 ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు డిఆర్ఎల్స్, కొత్తఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, శాటిన్ ఫినిషింగ్‌తో కూడిన కొత్త గ్రిల్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అలాగే అప్‌డేట్ చేయబడిన ఎల్ఈడీ సిగ్నేచర్తో కూడిన విశాలమైన టైల్‌లైట్‌ల సెట్ కూడా పొందింది.
2024 బివైడి e6 లోపలి భాగంలో అవుట్‌గోయింగ్ కారు వలె 10.2-ఇంచ్ యూనిట్‌ను రిప్లేస్ చేసిన 12.8-ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ యూనిట్ ను పొందుతుందని సూచిస్తుంది. మరోవైపు,ఇది కొత్త స్టీరింగ్ వీల్, కొత్త గేర్ సెలెక్టర్ డయల్ మరియు డ్యూయల్ వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్‌లలో మార్పులు పొందుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే, అంతర్జాతీయ-స్పెక్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉన్నాయి. అయితే ఇవి ఇండియన్ మార్కెట్ వెర్షన్‌లో అందించబడతాయో లేదో ? అనేది చూడాలి.
ఫేస్‌లిఫ్టెడ్ BYD e6 అని మాత్రమే కాకుండా M6 అని కూడా పిలువబడే ఈ మోడల్ బ్యాటరీ ప్యాక్‌లు ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడ్డాయి. రెండోది పొందే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం అందిచబడుతున్న 71.7kWh యూనిట్ నుండి చిన్న అప్‌డేట్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, 94bhp మరియు 180Nm పవర్ అవుట్‌పుట్ 204bhp మరియు 310Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేసిన ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్లు నుండి 530 కిలోమీటర్లు వరకు మైలేజీని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప