- 3 వేరియంట్స్ లో లభ్యం
- 230 కి.మీ. క్లెయిమ్డ్ మైలేజీ దీని సొంతం
ఎంజి కామెట్ ఈవీ ప్రస్తుతం ఇండియాలో ఎవరైనా కొనుగోలు చేయగల మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ 4-సీట్ ఎలక్ట్రిక్ కారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం, ఈ మోడల్ 3 వేరియంట్స్ లో లభిస్తుంది, అవి పేస్, ప్లే మరియు ప్లస్. దీని ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
డిసెంబర్ నెలలో కస్టమర్స్ ఎవరైతే ఎంజి కామెట్ ఈవీ బుక్ చేసుకోవాలని భావిస్తున్నారో వారు సుమారు రూ.65,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్స్ క్యాష్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ బోనస్, మరియు ఇతర స్పెషల్ స్కీమ్స్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి మరింత సమాచారం కోసం మీకు దగ్గరలో ఉన్న ఎంజి-అధికారిక డీలర్స్ ని సంప్రదించమని మేము కోరుతున్నాము.
కామెట్ ఈవీ యొక్క సింగిల్ మోటార్ 17.3kWh బ్యాటరీ ప్యాక్ యూనిట్ 7 గంటల్లో 0 నుండి 100 శాతం వరకు చార్జ్ చేయబడుతుంది. ఈ కామెట్ ఈవీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 41bhp మరియు 110Nm టార్కునుఉత్పత్తి చేయడమే కాకుండా 230 కి.మీ. క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. మొత్తానికి దీనిని మేము టెస్ట్ చేయగా ఈ మోడల్ 191 కి.మీ. రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ మైలేజిని ఇవ్వగలిగింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్