ఏఆర్ఏఐ నుంచి అధికారిక సర్టిఫికేట్ ని పొందిన అట్టో 3
అక్టోబర్-2022లో లాంచ్ అయిన మోడల్
బివైడి అట్టో 3ని బుక్ చేసి దాని కోసం ఎదురుచూస్తున్నారా? ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ కోసం ఆటోమేకర్ ఏఆర్ఏఐ నుంచి అధికారిక సర్టిఫికేట్‌ను పొందినందున ఇప్పుడు మీ బుకింగ్ కష్టాలు త్వరలో తొలగిపోనున్నాయి. అంటే అధికారికంగా పర్మిషన్ పొందని కార్లకు ప్రస్తుతం విధించిన 2,500 కార్ల లిమిట్ ని తొలగించినందున, ఇప్పుడు ఎక్కువ కార్లను దిగుమతి చేసుకోవచ్చు. దీని అర్థం బివైడి కారును ఎస్‍కెడి మోడల్ నుంచి సికెడి మోడల్‌కు మార్చడం ద్వారా దాని ధరలను తగ్గించాలని కంపెనీ భావిస్తుంది. దీంతో బుక్ చేసిన కారును మరింత తొందరగా పొందవచ్చు.
ధర తగ్గుదల లోయర్-స్పెక్ వేరియంట్‌తో ప్రారంభమవుతుందని అంచనా వేయబడగా, దీని వివరాలను మేము కొన్ని నెలల క్రితం ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందించాము. రాబోయే (అప్‍కమింగ్) వేరియంట్ 264 కిలోమీటర్ల క్లెయిమ్డ్ మైలేజీని అందించే అదే బ్యాటరీ ప్యాక్‌ను పొందవచ్చు. దీనికి విరుద్ధంగా, ఫుల్లీలోడెడ్ అట్టో3ని ఫుల్ ఛార్జ్ చేస్తే 512 కిలోమీటర్ల క్లెయిమ్ రేంజ్ ని అందిస్తుంది.
ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వెర్షన్ లో అట్టో3కి పోటీగా ఏవీ లేవు కానీ, ఐసీఈ వెర్షన్ పరంగా, అట్టో 3 హ్యుందాయ్ టక్సన్, ఎంజి గ్లోస్టర్, మరియు టయోటా ఫార్చూనర్ లోయర్-స్పెక్ వెర్షన్ తో పాటుగా ఇతర భారీ వెహికిల్స్ తో పోటీ పడుతుంది. అయితే, వచ్చే ఏడాది లోపు లేదా దాని తర్వాత, ఈవీ వెర్షన్ లో టాటా మరియు మహీంద్రా నుండి వచ్చే మోడల్స్ ని అటో 3కి పోటీగా మనం చూడవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్