- ఎక్స్4లో మొదటిసారిగా అందుబాటులోకి రానున్నM40i వేరియంట్
- 382bhp-ఉత్పత్తి చేసే పవర్డ్ 3.0-లీటర్, 6-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్
గత కొన్ని రోజుల క్రితమే టీజర్స్ సెట్ ను విడుదల చేసిన తర్వాత, బిఎండబ్ల్యూ ఇప్పుడు ఎక్స్4 M40iని దేశంఅంతటా విడుదల చేసింది. దీని ధరలు రూ. 96.20 లక్ష (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో దీని మొదటి మోడల్ నిలిపివేయగా, ఇందులోని ఎక్స్4 మోడల్ ఇండియన్ మార్కెట్లోకి ఇటరేషన్ పద్ధతిలో రావడాన్ని మనం చూస్తున్నాం.
డిజైన్ పరంగా చూస్తే, కొత్త బిఎండబ్ల్యూ ఎక్స్4, కూపే-ఎస్‌యువి సిల్హౌట్ కాకుండా, ట్విన్ ఎల్- షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, గ్లోసీ బ్లాక్ గ్రిల్, స్కిడ్ ప్లేట్లు మరియు ఒఆర్‍విఎంఎస్, కొత్త 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ర్యాప్‌అరౌండ్ టూ-పీస్ ఎల్ఈడీ టైల్‌లైట్స్ వంటి బెస్ట్ ఫీచర్లను పొందింది.
లోపల భాగంలోచూస్తే, అప్‌డేట్ చేయబడిన ఎక్స్4 డ్యూయల్-టోన్ థీమ్ లో రాగా, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, 12.3 ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రిక్లైనింగ్ రియర్ సీట్స్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ ను పొందింది.
2023 బిఎండబ్ల్యూ ఎక్స్4 M40i అనేది 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి మాక్సిమమ్ 382bhp మరియు 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0-100kmph వరకు వేగాన్ని అందుకొనిఇందులో ఎలక్ట్రానికల్ గా లిమిట్ గా పేర్కొన్నటాప్ స్పీడ్ 210kmph ని ఈజీగా చేరుకోగలదు.
అనువాదించిన వారు:రాజపుష్ప