- గంటకు 213కెఎంపిహెచ్ వేగాన్ని అందుకునే టాప్-స్పీడ్ దీని సొంతం
- కేవలం 7.9 సెకన్లలో 0 -100కెఎంపిహెచ్ వేగం దీని ప్రత్యేకత
లగ్జరీ కార్ల కంపెనీ బిఎండబ్లూ ఇండియాలో నేడే రూ. 74.90 లక్షల ఎక్స్-షోరూం ధరతో X3 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్ అనే కొత్త మోడల్ ని లాంచ్ చేసింది. ఇది బిఎండబ్లూ నుంచి అందించబడుతున్న X3 స్పెషల్ ఎడిషన్ కాగా, ఇది డీజిల్ పవర్ తో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మోడల్ బిఎండబ్లూ ఇండియాకి చెందిన అన్ని డీలర్ షిప్స్ వద్ద బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది మరియు దీనిని నేటి నుంచే బిఎండబ్లూ ఆన్ లైన్ షాప్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు.
ఈ షాడో ఎడిషన్ ని పరిశీలిస్తే, ఇది యూనిక్ బ్లూ యాక్సెంట్లతో బ్లాక్డ్ అవుట్ కిడ్నీ గ్రిల్ మరియు బిఎండబ్లూ లేజర్ లైట్ టెక్నాలజీతో వచ్చింది. టెయిల్ పైప్స్ హై-గ్లోస్ బ్లాక్ కలర్ లో పెయింట్ చేయబడగా, విండో గ్రాఫిక్స్, రూఫ్ రెయిల్స్ మరియు బిఎండబ్లూ కిడ్నీ ఫ్రేమ్ మరియు బార్స్ కూడా హై-గ్లోస్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా, లోపల ఎం స్పెక్ మల్టీ-ఫంక్షన్ స్పోర్ట్ స్టీరింగ్ వీల, ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్ మెంట్ మరియు ఎం స్పోర్ట్ ప్యాకేజీని పొందవచ్చు. ఈ కారు స్టాండర్డ్ గా ఆరు డిమ్మబుల్ డిజైన్లలో యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రోలర్ సన్ బ్లైండ్స్, మరియు 40/20/40 స్ప్లిట్ రియర్ సీట్ బ్యాక్ రెస్ట్, 500-లీటర్ల నుంచి 1600-లీటర్ల వరకు విస్తరించి ఉన్న బూట్ స్పేస్ ని పొందింది. ఈ కారు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ని అందించడానికి బిఎండబ్లూ డ్రైవింగ్ అసిస్టెంట్ ని కూడా పొందగా, ఇది డ్రైవరును కారు లేన్ చేంజ్, ఫ్రంట్ కొలిజన్, మరియు రియర్ కొలిజన్ కి గురికాకుండా అప్రమత్తం చేసి, హెచ్చరించడంలో సహాయపడుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో 360-డిగ్రీ కెమెరా పార్కింగ్ అసిస్టెంట్ కారును ఈజీగా పార్కింగ్ చేసేలా యాక్సెలరేషన్ ని కంట్రోల్ చేస్తుంది, అలాగే స్టీరింగ్ అదుపులో ఉంచుతుంది.
ఈ స్పెషల్ ఎడిషన్ బిఎండబ్లూ 2.0-లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 187bhp/400 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 7.9 సెకన్లలో 0 -100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుండగా, 213కెఎంపిహెచ్ టాప్-స్పీడ్ వేగాన్ని కలిగి ఉంది. కారు నాలుగు వీల్స్ కి 8-స్పీడ్ ఎటి మరియు బిఎండబ్లూ ఎక్స్‌డ్రైవ్ ఏడబ్లూడీ సిస్టం ద్వారా పవర్ ని సప్లై చేస్తుంది.
ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇటువంటి మోడల్స్ తయారు చేయడం ద్వారా హైప్‌ను క్రియేట్ చేసి క్యాష్ చేసుకోవడానికి బిఎండబ్లూ దాని ఎం-బేస్డ్ ఎడిషన్‌లను లాంచ్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో ఇది బిఎండబ్లూ నుంచి అందించబడుతున్న మూడవ ఎం స్పెషల్ ఎడిషన్ మాత్రమే.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్