- మే-2023లో అరంగేట్రం చేసిన 8వ జనరేషన్ 5 సిరీస్
- ఇండియాలో అరంగేట్రం చేయనున్న 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్ మోడల్స్
బిఎండబ్లూ కంపెనీ మే-2023లో 8వ జనరేషన్ 5 సిరీస్ ని ఇండియాలో తీసుకువచ్చింది. ఇప్పుడు, సరిగ్గా సంవత్సరం తర్వాత, ఆటోమేకర్ బ్రాండ్ సెడాన్ ఇటరేషన్ ని జూలై 24న అధికారికంగా ఇండియాలో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది.
లాంగ్ వీల్ బేస్ రూపంలో రావడానికి సిద్ధం కాగా, ఈ కొత్త 5 సిరీస్ ఎప్పటినుంచో పోటీగా ఉన్న ఈ-క్లాస్ మోడల్స్ (లాంగ్ వీల్ బేస్ తో ఇండియాలో కూడా లభ్యం) డైరెక్టుగా పోటీ పడుతుంది. కాంపీటీషన్ పరంగా, 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్ అందుకోవడం ద్వారా బిఎండబ్లూకి చైనా తర్వాత ఇది రెండవ మార్కెట్ కానుంది. ముఖ్యంగా, కొత్త 5 సిరీస్ నుంచి ఈవీ డెరివేటివ్ గా పిలువబడే i5 మోడల్ ఏప్రిల్-2024లో లాంచ్ అయింది.
2024బిఎండబ్లూ 5 సిరీస్ ఎక్స్‌టీరియర్ హైలైట్లలో సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ డిజైన్, ట్విన్ సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కొత్త హెడ్ ల్యాంప్స్, సిల్వర్ ఇన్సర్ట్ లతో చంకీ ఫ్రంట్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, ఇల్యూమినేటెడ్ గ్రిల్, గుండ్రంగా కనిపించే కొత్త టూ-పీస్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు సి-పిల్లర్ పై ‘5’ బ్యాడ్జి వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఇంటీరియర్ పరంగా, న్యూ-జెన్ 5 సిరీస్ లోపలి భాగంలో 14.9-ఇంచ్ ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, 12.3-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ కన్సోల్, రిక్లైనింగ్ రియర్ సీట్స్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు రెండవ వరుసలో కూర్చునే ప్యాసింజర్ల కోసం ఫోల్డబుల్ 31.1-ఇంచ్ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
బానెట్ కింద, రాబోయే (అప్ కమింగ్) 5 సిరీస్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు మైల్డ్-హైబ్రిడ్ సిస్టంతో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా, ఈ మోడల్ రేంజ్ లో ఉన్న అన్ని కార్లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులోకి రానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్