- రూ. 1.89 కోట్ల ధరతో ఇండియాలో లాంచ్
- 3.0-లీటర్ ట్విన్-టర్బో 6-సిలిండర్ ఇంజన్ దీని ప్రత్యేకత
బిఎండబ్లూదాని కొత్త M4 CS అనే లగ్జరీ కారునుఇండియాలో రూ.1.89 కోట్లు (ఎక్స్-షోరూమ్ ధర) లాంచ్ చేసింది. ఈ M4 కాంపిటీషన్ కారు ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్ కారుగా రాగా, పవర్, పెర్ఫార్మెన్స్ మరియు డిజైన్ పరంగా అనేక అప్‌గ్రేడ్‌లతో వచ్చింది.
ఫీచర్లు మరియు డిజైన్
బిఎండబ్లూ కంపెనీM4 CS కారును మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, దీనికి ఎల్లో కలర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్రాంజ్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త కిడ్నీ గ్రిల్ ని అందించింది. ఈ కారు మరింత స్పెషల్ గా కనిపించడానికి దీని ఇంటీరియర్లో M- కార్బన్ బకెట్ సీట్లు, 14.9-ఇంచ్ టచ్‌స్క్రీన్ మరియు 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను బిఎండబ్లూ తీసుకువచ్చింది. అలాగే ఈ కారులో M-స్పెసిఫిక్ గ్రాఫిక్స్ మరియు M-సీట్‌బెల్ట్స్ కూడా ఉన్నాయి.
ఇంజిన్ మరియు పెర్ఫార్మెన్స్
M4 CS లగ్జరీ కారు 3.0-లీటర్ ట్విన్-టర్బో 6-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది, ఇది 543bhp పవర్ మరియు 650Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుంది. M4 CS కారు బరువును తగ్గించడానికి, బిఎండబ్లూ కంపెనీ టైటానియం ఎగ్జాస్ట్ మరియు కార్బన్ ఫైబర్ ని ఉపయోగించింది. దీని కారణంగా, ఈ కారు పెర్ఫార్మెన్స్ మరింత మెరుగయ్యింది.
గంటకు 302 కిలోమీటర్లు దూసుకెళ్ళే బిఎండబ్లూ M4 CS కారు ఆడి RS5 మరియు మెర్సిడెస్ C63 S ఇ-పెర్ఫార్మెన్స్ వంటి కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్