- ఆగస్టు 12వ తేదీ నుంచి కర్వ్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం
- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వచ్చిన కర్వ్ ఎలక్ట్రిక్ మోడల్
టాటా మోటార్స్ ఆగస్టు 7న కర్వ్ ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చి ఇండియన్ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఓ విషయాన్ని మీరు గమనిస్తే, టాటా కంపెనీ దాని ఎలక్ట్రిక్ కార్ల సంఖ్యను పెంచుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు మోడల్స్ ని తీసుకురాగా, ఇప్పుడు కర్వ్ ఎలక్ట్రిక్ కారును రూ.17.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. మీరు ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే, వీటి బుకింగ్స్ ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే, కారు డెలివరీకి కూడా ఎంతో సమయం పట్టేలా లేదు. ఎందుకంటే, ఈ కారును ఆగస్టు 23వ తేదీ నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది.
కర్వ్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ గురించి చెప్పాలంటే, అద్బుతమైన డిజైన్ తో వచ్చింది. కర్వ్ ఎలక్ట్రిక్ మోడల్ ఎక్స్‌టీరియర్ హైలైట్లలో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, గ్లోసీ బ్లాక్ క్లాడింగ్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, కారు ముందు మరియు వెనుక భాగాలలో ఎల్ఈడీ లైట్ బార్స్, కారు ఫేసియా ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-టోన్ వీల్స్, స్లోపింగ్ రూఫ్ లైన్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి బెస్ట్ ఫీచర్లను టాటా మోటార్స్ అందించింది.
ఇంటీరియర్ పరంగా, కర్వ్ ఈవీ కారు కలిగి ఉంది. ఇందులోని కీలక చెప్పాలంటే, డ్యాష్ బోర్డుపై ఫాక్స్ కార్బన్-ఫైబర్ ఫినిషింగ్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ఫోర్-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ యూనిట్, ఏసీ బటన్లను ఆపరేట్ చేయడానికి టచ్ కంట్రోల్స్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, కర్వ్ కారు 20 సేఫ్టీ ఫీచర్లతో లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ తో వచ్చింది. ఇంకా ఇందులో 500 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుండగా, కారు ముందు భాగంలో అందించబడిన ఫ్రంక్ స్పేస్ 11.6 లీటర్లుగా ఉంది.
కర్వ్ ఎలక్ట్రిక్ కారులో 45kWh యూనిట్ మరియు 55kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రాగా, ఈ రెండింటిని సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి వచ్చాయి. అలాగే, డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 10 నిమిషాల్లో 100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందించే బ్యాటరీతో కర్వ్ ఈవీ వచ్చింది. ఇంకా, ఈ కారులోని 55kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ యూనిట్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని, 45kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 502 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.