- రాష్ట్రవ్యాప్తంగా 0001 సిరీస్ తో మొదలు కానున్న రిజిస్ట్రేషన్ నంబర్లు
- యథావిధిగా కొనసాగనున్న ప్రస్తుత రిజిస్ట్రేషన్ నంబర్లు
తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత గత పదేళ్లకు పైగా “TS” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వాహనాల రిజిస్ట్రేషన్ కొనసాగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం “TS” పేరును “TG” గా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయగా, ఎట్టకేలకు దీనికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై “TS” పేరుతో కొనసాగిన రిజిస్ట్రేషన్ “TG” గా మారింది. వాహనాల రిజిస్ట్రేషన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఒక జీవోను విడుదల చేసింది. ఈ పేర్ల మార్పు నేటి నుంచే అమలులోకి వచ్చింది.
ఇక వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్స్ విషయానికి వస్తే, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 0001 నుంచి సిరీస్ మొదలయింది. ఖైరతాబాద్ ఆర్టీవో పరిధిలో ‘TG 09 0001’ నంబర్ నుంచి సిరీస్ జారీ చేస్తారు. ఈ నంబర్ 9999తో పూర్తయిన అనంతరం టీజీ 09A 0001తో సిరీస్ ప్రారంభమై 09A 9999తో ముగుస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల ట్రాన్స్ పోర్ట్ అథారిటీలకు లభించిన రిజిస్ట్రేషన్ కోడ్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
రిజిస్టరింగ్ అథారిటీ | రిజిస్టరింగ్ అథారిటీ కోడ్ |
ఆదిలాబాద్ | TG-01 |
కరీంనగర్ | TG-02 |
హనుమకొండ | TG-03 |
ఖమ్మం | TG-04 |
నల్గొండ | TG-05 |
మహబూబ్ నగర్ | TG-06 |
రంగారెడ్డి | TG-07 |
మేడ్చల్-మల్కాజ్ గిరి | TG-08 |
1.హైదరాబాద్ 2.పొలీస్ డిపార్ట్ మెంట్ వెహికిల్స్ | TG-09, 10, 11, 12, 13, మరియు 14 09 కింద “P” తో మొదలయ్యేవి |
సంగారెడ్డి | TG-15 |
నిజామాబాద్ | TG-16 |
కామారెడ్డి | TG-17 |
నిర్మల్ | TG-18 |
మంచిర్యాల | TG-19 |
కుమురం భీం ఆసిఫాబాద్ | TG-20 |
జగిత్యాల | TG-21 |
పెద్దపల్లి | TG-22 |
రాజన్న సిరిసిల్ల | TG-23 |
వరంగల్ | TG-24 |
జయశంకర్ భూపాలపల్లి | TG-25 |
మహబూబాబాద్ | TG-26 |
జనగామ | TG-27 |
భద్రాద్రి కొత్తగూడెం | TG-28 |
సూర్యాపేట | TG-29 |
యాదాద్రి-భువనగిరి | TG-30 |
నాగర్ కర్నూల్ | TG-31 |
వనపర్తి | TG-32 |
జోగులాంబ గద్వాల్ | TG-33 |
వికారాబాద్ | TG-34 |
మెదక్ | TG-35 |
సిద్ధిపేట | TG-36 |
ములుగు | TG-37 |
నారాయణపేట | TG-38 |