- ఆటో ఎక్స్‌పో మరియు భారత్ మొబిలిటీ ఎక్స్‌పో రెండింటిని కలిపి నిర్వహణ
- జనవరిలో జరగనున్న 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పో
ఈ సంవత్సరం ఈవెంట్ విజయవంతం అయిన తర్వాత భారత్ మొబిలిటీ ఎక్స్‌పో మళ్ళీ 2025లో తర్వాతి ఎడిషన్ ని నిర్వహించడానికి నిర్వాహకులు వాటి నిర్వహణ తేదీలను ప్రకటించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025గా పిలువబడే ఇది వివిధ ప్రాంతాల్లో అనగా యశోభూమిగా పిలువబడే భారతమండపం (ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మరియు ఎక్స్‌పో సెంటర్) ద్వారకలో, మరియు ఇండియా ఎక్స్‌పో సెంటర్ మరియు మార్ట్, గ్రేటర్ నోయిడాలో జనవరి 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించబతుంది.
ఆర్గనైజర్స్ ప్రకారం, ఎక్స్‌పోలో కమర్షియల్, ప్యాసింజర్, మరియు ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ) వంటి వాహనాలను వివిధ ఆటోమొబైల్ కంపెనీలు ప్రదర్శించనున్నాయి. ఇంకా చెప్పాలంటే, సిఐఎఎం మరియు ఎసిఎంఎ వంటి అసోసియేషన్లు ఇందులో పాల్గొననున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, ఆటో ఎక్స్‌పో-2025 జరగనుండగా, దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోతో కలిపి జనవరిలో ఈ రెండింటిని ఒకేసారి నిర్వహించనున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో నెక్సాన్ మరియు నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్స్, హారియర్ మరియు సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్, టాటా కర్వ్, స్కోడా ఎన్యాక్, మెర్సిడెస్ EQC, మారుతి బ్రెజా సిఎన్‍జి మరియు వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ తో పాటుగా మరెన్నో కొత్త ప్రొడక్ట్స్ అరంగేట్రం చేశాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్