- వివిధ మోడల్స్ తో పాటుగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇన్నోవా హైక్రాస్ ని ప్రదర్శించిన టయోటా
- ఎటువంటి మార్పు లేని పవర్ అవుట్‌పుట్
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం), మిరాయ్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ నుండి హిలక్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ట్రక్ వరకు అనేక ప్రొడక్ట్స్ నిభారత్ మొబిలిటీ ఎక్స్‌పో-2024లో ప్రదర్శించింది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్‌లో, ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వివరాలను పరిశీలిద్దాం.
గత సంవత్సరం చివర్లో ఇది ఆవిష్కరించబడింది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ రెగ్యులర్ ఇన్నోవా హైక్రాస్‌పై ఆధారపడి ఉండగా. రెండోది పూర్తి డిజైన్‌ను కలిగి ఉంది. ఈ వెర్షన్ యొక్క ముఖ్యమైన హైలైట్స్ ఏంటి అంటే, ఈ యూనిట్ బానెట్ మరియు రెండు వైపులా ఫ్లెక్స్-ఫ్యూయల్ స్టిక్కర్లను కలిగి ఉండగా, ఫ్యూయల్ మూతపై పవర్డ్ బై ఇథనాల్ అనే స్టిక్కర్ ని కలిగి ఉంది. ఇది ప్రోటోటైప్ కారు మాత్రమే మరియు ఉత్పత్తికి సిద్ధం కానీ వెర్షన్ అని మీరు గమనించాలి.
ఇది 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుందని టయోటా ఉద్దేశించినప్పటికీ. దీని పవర్ అవుట్‌పుట్ లో ఎటువంటి మార్పు లేదని టయోటా పేర్కొంది. ఈ తెలియని వారి కోసం, ఇండియాలోని చాలా ఫ్యూయల్ పంపులు ప్రస్తుతం 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌ను విక్రయిస్తోంది.
ఈ ఇన్నోవా హైక్రాస్, స్టాండర్డ్ లేదా ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ , 2.0-లీటర్ పవర్ 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 143bhp మరియు 188Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ వెర్షన్ 11bhp మరియు 206Nm టార్కుని ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప