- ఈ బ్రాండ్ నుండి ఇండియాలో మొదటి ఈవీ ఆఫర్ ఎన్యాక్
- భారతదేశం అంతటా అనేక సందర్భాల్లో టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా ఎన్యాక్
చెక్ బ్రాండ్ స్కోడా మొదటిసారిగా ఇండియాలో ఎన్యాక్ ఈవీని ప్రదర్శించింది. ఇండియాలోనే ఇది బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆఫర్ ఇదే కావచ్చు, అలాగే, ఇది ఇప్పటికే అనేక సందర్భాల్లో భారతదేశం అంతటా పబ్లిక్ రోడ్స్ పై టెస్ట్ చేస్తూ కనిపించింది.
ప్రపంచవ్యాప్తంగా 2022లో అధికారికంగా ఆవిష్కరించబడిన ఎన్యాక్ సీబీయూ మార్గం ద్వారా ఇండియాలో విక్రయించబడుతుందని భావిస్తున్నాం. ఇది కార్‌మేకర్ యొక్క ఎంఈబీ ప్లాట్‌ఫారమ్ ద్వారా మద్దతునిస్తుంది, ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4 ని పోలి ఉండగా, ఇది త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్ కానుంది.
ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే , కొత్త స్కోడా ఎన్యాక్‌లో ఇల్యూమినేటెడ్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తోకూడిన స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, చుట్టూ కాంట్రాస్ట్ బ్లాక్ ఇన్సర్ట్స్, రెండు వైపులా ఏరో-ఇన్‍స్పైర్డ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ డోర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్ ఉన్నాయి. అంతేకాకుండా, ర్యాప్‌రౌండ్ టూ-పీస్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, స్కోడా లెటరింగ్, టెయిల్‌గేట్‌పై నెంబర్ ప్లేట్ రీసెస్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా కూడా ఆఫర్‌లో ఉన్నాయి.
లోపల వైపు, ఎన్యాక్‌లోఏడీఏఎస్సూట్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్ ఆల్-డిజిటల్ డిస్‌ప్లేస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్ మరియు 3-స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి అనేకమైన ఫీచర్లు ఉంటాయి.
స్కోడా ఎన్యాక్ పవర్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడిన 77kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది కంబైన్డ్ గా 265bhp టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే, దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 550కిమీ వరకు క్లెయిమ్డ్ మైలేజీని అందించనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప