ఇండియన్ కార్ మార్కెట్ రంగం ఇటీవలి సంవత్సరాలలో చోటుచేసుకుంటున్న మార్పును గమనించి ఎంపివి క్లాస్ ని ఒక విభాగంగా మార్చింది. డానికి అనుగుణంగా, చాలా మంది తయారీదారులు పెరుగుతున్న ఎస్‌యువి సెగ్మెంట్ నుండి మరింత మార్కెట్ వాటాను పొందడంపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా, ఇప్పటికి వారిలో కొందరు తమ ఎంపివి వెహికిల్స్ పై గట్టి నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కథనంలో, ప్రస్తుతం భారతదేశంలో రూ.12 లక్షలు లేదా అంతకంటే తక్కువ బడ్జెట్‌తో కొనుగోలు చేయగల ఉత్తమమైన 7-సీటర్ కార్లను మేము లిస్ట్ చేసాము. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
రెనాల్ట్ ట్రైబర్
ప్రస్తుతం దేశంలో అత్యంత తక్కువ ధరతో ఉన్న 7 సీట్ల మోడల్ లో రెనాల్ట్ ట్రైబర్ ను కొనుగోలు చేయవచ్చు. ఇది లాంచ్ అయినపుడు, ఎంపివి ఒక హ్యాచ్‌బ్యాక్ లేదా కాంపాక్ట్ సెడాన్ బడ్జెట్‌లో 7-సీటర్ ను పొందాలని చూస్తున్న వినియోగదారుల నుండి బాగా ఆదరణ పొందింది. 5 వేరియంట్లలో లభిస్తున్న మూడు వరుసల ఫ్రెంచ్ ఎంపివి ప్రస్తుత ప్రారంభ ధర రూ. 6.33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటారుతో వస్తుంది.
మారుతీ సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగా 'తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థలం' తరంలో చాలా బాగా హిట్ అయింది. ఇది ఎల్ యూవీ - లైఫ్ యుటిలిటీ వెహికల్ అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో ప్రారంభ ధర రూ. 5.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో అందుబాటులో ఉంది. అప్పటి నుండి, ఈ మోడల్ మూడు ఫేస్‌లిఫ్ట్‌లను పొందింది మరియు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి ఉత్పత్తులలో ఒకటిగా నిలిచింది. తరువాత, ఆటోమేకర్ దాని ప్రీమియం నెక్సా అవుట్‌లెట్‌ల క్రింద XL6 రూపంలో ఎర్టిగా లో 6-సీట్ల వెర్షన్‌ను కూడా పరిచయం చేసింది. మారుతి ఎర్టిగాను ప్రస్తుతం పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రూ. 8.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
కియా కారెన్స్
కియా ఇండియా డిసెంబరు 2021లో అరంగేట్రం చేసిన తర్వాత 2022లో దేశంలో కారెన్స్ ఎంపివిని విడుదల చేసింది. కారెన్స్ అనేది మరింత మోడరన్ డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్లతో మారుతి ఎర్టిగా మరియు XL6 లకు కొరియన్ ఆటోమేకర్ కు ధీటుగా నిలిచింది. ఈ బ్రాండ్ దీనిని ఆర్ వి (రిక్రియేషనల్ వెహికల్) అని పిలుస్తుంది మరియు దీనిని ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ (O), లగ్జరీ ప్లస్ మరియు ఇటీవల ప్రారంభించిన X-లైన్ వేరియంట్ అనే 7 వేరియంట్‌లలో పొందవచ్చు. కారెన్స్ ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ తో రూ. 10.45 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో పొందవచ్చు.
మహీంద్రా బొలెరో మరియు బొలెరో నియో
ప్రస్తుతం, మహీంద్రా బొలెరో మరియు బొలెరో నియోలు ఎంపివిలు కాకపోయినా కానీ, అదే బడ్జెట్ రేంజ్ లో 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లను అందిస్తున్నాయి. అవి రెండూ డీజిల్-మాత్రమే మోడల్‌లు, బొలెరో దాని స్వభావానికి మరింత కొత్తగా ఉంటుంది మరియు టియువి300 యొక్క స్థానంలో బొలెరో నియో మరింత అర్బన్ డిజైన్ మరియుగుర్తింపును పొందింది. బొలెరో మరియు బొలెరో నియో వరుసగా రూ. 9.79 లక్షలు నుండి రూ. 9.64 లక్షలు, వరకు ప్రారంభ ధర (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)తో లభిస్తాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప