- అప్ డేటెడ్ డిజైన్ తో వచ్చిన 2024 ఆడి Q8
- రూ.5 లక్షలతో బుకింగ్స్ ప్రారంభం
ఆడి ఇండియా దేశవ్యాప్తంగా ఫేస్‍లిఫ్టెడ్ Q8 లగ్జరీ కారును లాంచ్ చేయగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ.1.17 కోట్ల నుంచి ప్రారంభమయ్యాయి. అప్ డేటెడ్ ఎస్‍యూవీ రివైజ్డ్ స్టైలింగ్ అంశాలను మరియు ఫీచర్ అప్ గ్రేడ్లను పొందగా, పవర్ ట్రెయిన్లలో ఎలాంటి మార్పులు లేకుండా వచ్చింది.
కస్టమర్లు కొత్త Q8 లగ్జరీ కారును ఆడి అధికారిక డీలర్ షిప్స్ వద్ద లేదా బ్రాండ్ వెబ్ సైట్ లో రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్ల పరంగా, ఈ ఎస్‍యూవీని మైతోస్ బ్లాక్, సాఖిర్ గోల్డ్, గ్లేసియర్ వైట్, వైటోమో బ్లూ, టామరిండ్ బ్రౌన్, సమురాయ్ గ్రే, వికునా బీజ్, మరియు సాటిలైట్ సిల్వర్ అంటే కలర్లలో పొందవచ్చు. అదే విధంగా, దీని ఇంటీరియర్ థీమ్ విషయానికి వస్తే, దీనిని పాండో గ్రే, ఒకాపి బ్రౌన్, బ్లాక్, మరియు సైగా బీజ్ వంటి ఇంటీరియర్ థీమ్ లలో పొందవచ్చు.
ఇంకా, 2024 ఆడి Q8లో అందించబడిన డిజైన్ హైలైట్ల విషయానికి వస్తే, ఇది బ్లాక్డ్-అవుట్ ట్రెపిజాయిడ్-షేప్డ్ గ్రిల్, ట్వీక్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కొత్త మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రిఫ్రెష్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, విశాలమైన ఎయిర్ డ్యాం, మరియు కొత్త ఓఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి డిజైన్ హైలైట్లతో వచ్చింది.
Q8ఫేస్‍లిఫ్ట్ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, ఈ లగ్జరీ కారులో త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, వర్చువల్ కాక్‌పిట్, సెంటర్ కన్సోల్‌లో ట్విన్ టచ్ ప్యానెల్స్ (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఏసీ కంట్రోల్ కోసం ఒక్కొక్కటి), పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, 360-డిగ్రీ కెమెరా, బి&ఓ-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, మరియు ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి.
అప్ డేటెడ్ Q8 ఒకే రకమైన పవర్ ట్రెయిన్ మరియు ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. అంటే, ప్రస్తుతం Q8 కారులో ఉన్నవే ఇందులో కూడా అందించబడ్డాయి. ఇందులోని 3.0-లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టంతో జతచేయబడి వచ్చింది. ఇంకా పవర్ అవుట్ పుట్ విషయానికి వస్తే, ఈ కారు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తూ 335bhp మరియు 500Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్