- కాస్మెటిక్ మార్పులను పొందిన స్పెషల్ ఎడిషన్
- రూ. 97,84,000 ప్రారంభ ధరతో లభ్యం
ఆడి ఇటీవలే Q7లో బోల్డ్ ఎడిషన్ అనే కొత్త స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఉన్న స్టైలింగ్ ఫీచర్లు కారుకు ప్రత్యేకమైన రూపాన్ని అందించడానికి బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీని కూడా కలిగిఉన్నాయి. అలాగే, ఇప్పటికే ఈమోడల్ డెలివరీ మొదలవ్వగా కాస్మెటిక్ మార్పులతో ఎస్‌యువి ఎలా కనిపిస్తుందో ఇక్కడ మీరు చూడవచ్చు.
ఇక్కడ ఉన్న చిత్రాలలో బ్లాక్ కలర్ తో ఉన్నప్పటికీ, Q7 బోల్డ్ ఎడిషన్ నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే, గ్లేసియర్ వైట్ మరియు మైథోస్ బ్లాక్ అనే 4 ఎక్స్‌టీరియర్ కలర్స్ లో అందుబాటులో ఉంది.
అలాగే, Q7 బోల్డ్ ఎడిషన్ బ్లాక్-అవుట్ లోగో మరియు గ్రిల్ ఫ్రేమ్‌తో డీ-క్రోమ్డ్ లుక్‌ను కలిగి ఉంది. ఇది స్కిడ్ ప్లేట్‌తో సహా బంపర్ క్రింది భాగం కూడా సిల్వర్ యాక్సెంట్స్ కు బదులుగా డార్క్ కలర్ ను పొందింది.
మరో వైపు, ఎస్‌యువిబ్లాక్ రూఫ్ రెయిల్స్, విండో సరౌండ్స్, ఒఆర్‍విఎంఎస్ మరియు బ్లాక్ క్లాడింగ్‌లను కలిగి ఉంది. వెనుక డోర్‌పై చిన్న స్టిక్కర్ ఉండగా ఈ కారు ఎల్ఈడీ పుడిల్ ల్యాంప్‌లను పొందింది.
అదే 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై రైడింగ్, డిజైన్ ప్యాటర్న్ కూడా ఇంతకు ముందు లాగానే ఉంటుంది కానీ డ్యూయల్-టోన్ లుక్‌ను పొందుతుంది. అంతేకాకుండా, సెల్ఫ్-సెంటరింగ్ డైనమిక్ హబ్ క్యాప్‌లు కూడా అందించబడ్డాయి.
వెనుక భాగంలో, మీరు గమనిస్తే బ్లాక్-అవుట్ ఆడి రింగ్స్, టెయిల్‌గేట్‌పై గ్లోస్ బ్లాక్ స్లాట్ Q7 బ్యాడ్జింగ్‌ను పొందింది . దీనిలో బ్లాక్ థీమ్‌తో మ్యాచ్ అయ్యేలా బంపర్‌లోని క్రోమ్ ఎలిమెంట్‌లు తొలగించబడ్డాయి.
లోపల భాగంలో, ఎటువంటి మార్పులు లేకపోగా, Q7 బోల్డ్ ఎడిషన్ Q7 ఎస్‌యువిలో స్టాండర్డ్ వెర్షన్ వలె అదే లేఅవుట్ మరియు ఫీచర్స్ నుకొనసాగిస్తుంది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
ఆడి Q7 బోల్డ్ ఎడిషన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడిన 3.0-లీటర్ టర్బో-V6 ఇంజిన్ ను పొందింది. ఇది 335bhp మరియు 500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప