- లిమిటెడ్ మోడల్ గా అందించబడనున్న బోల్డ్ ఎడిషన్ కారు
- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వస్తున్న ఆడి Q5 స్పెషల్ ఎడిషన్
లగ్జరీ కార్ల కంపెనీ ఆడి ఇండియా Q5 ఎస్‍యూవీ ద్వారా 'బోల్డ్ ఎడిషన్' సిరీస్‌ను మరింత ముందుకు తీసుకువెళ్తుంది. Q5 బోల్డ్ ఎడిషన్ మోడల్ రూ. 72.30 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో ఇండియాలో నేడే లాంచ్ అయింది. బ్రాండ్ ఆన్‌లైన్ పోర్టల్ లేదా అధికారిక డీలర్‌షిప్‌లని సందర్శించడం ద్వారా కస్టమర్లు మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, Q5 బోల్డ్ ఎడిషన్ కారు లిమిటెడ్ మోడల్ గా తక్కువ సంఖ్యలో అందించబడుతుంది.
ఆడి Q5 బోల్డ్ ఎడిషన్ బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో మరింత మెరుగైన ఎక్స్‌టీరియర్ ని పొందింది. గ్రిల్, ఆడి లోగోలు, విండో సరౌండ్స్, ఓఆర్‌విఎంలు మరియు రూఫ్-రెయిల్స్‌పై హై గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఈ కారుకు మరింత అందాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా, Q5 బోల్డ్ ఎడిషన్ కారు ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది, అవి ఏంటి అంటే, గ్లేసియర్ వైట్, నవర్రా బ్లూ, మిథోస్ బ్లాక్, డిస్ట్రిక్ట్ గ్రీన్ మరియు మాన్హాటన్ గ్రే కలర్లు.
ఫీచర్ల విషయానికొస్తే, ఆడి Q5 లగ్జరీకారులో మెమరీ ఫంక్షన్‌తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరాతో పార్కింగ్ అసిస్ట్స్, 6 డ్రైవ్ మోడ్స్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 19-స్పీకర్ బ్యాంగ్ మరియు ఓలుఫ్‌సెన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ కాక్‌పిట్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.
మెకానికల్ గా, ఆడి Q5 బోల్డ్ ఎడిషన్ కారులోని 2.0-లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ మోటారు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి 261bhp మరియు 370Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కండీషన్లో, ఏడబ్లూడీ Q5 కారు కేవలం 6.1 సెకన్లలో సున్నా నుండి 100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోవడమే కాకుండా, 240 కెఎంపిహెచ్ ఎలక్ట్రానికల్లీ లిమిటెడ్ టాప్-స్పీడ్ ని చాలా ఈజీగా చేరుకుంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్