- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చిన ఇంజిన్
- రూ.1.49 లక్షలు ఎక్కువగా ఉన్న స్పెషల్ ఎడిషన్ల ధర
ఆడి ఇండియా Q3 మరియు A3 స్పోర్ట్ బ్యాక్ ఎడిషన్లను ఇండియాలో రూ.54.65 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. స్టాండర్డ్ వేరియంట్లతో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ల ధర రూ. 1.49 లక్షలు ఎక్కువ ఉండగా మరియు బ్లాక్డ్-అవుట్ ఎలిమెంట్లతో పాటుగా ఎస్ లైన్ ప్యాకేజీని పొందింది.
ప్యాకేజీ మాత్రమే కాకుండా, ఈ కొత్త ఎడిషన్లలోని కనిపించే హైలైట్లలో ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్స్, ఓఆర్‍విఎం, రూఫ్ రెయిల్స్, మరియు విండో లైన్లపై గ్లోస్ బ్లాక్ యాక్సెంట్స్ వంటివి ఉన్నాయి. 18-ఇంచ్ వీల్స్ ని కూడా స్పోర్ట్ లుక్ లో డ్యూయల్-టోన్ ఫినిష్ తో పొందింది.
అంతే కాకుండా, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్ పిట్, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, మరియు వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్ తో పాటుగా 10-స్పీకర్ ఆడి సౌండ్ సిస్టం వంటివి ఇంటీరియర్ లో భాగంగా ఉన్నాయి.
బానెట్ కింద, ఈ రెండు ఎస్‍యూవీలు ఇంతకు ముందు లాగే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చాయి. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి 192bhp మరియు320Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.