- మెర్సిడెస్-ఎఎంజి V8 ఇంజిన్ ని పొందిన లగ్జరీ కారు
- 2024 చివరి త్రైమాసికంలో వీటి డెలివరీ ప్రారంభం
కేవలం రెండు డోర్లు మాత్రమే ఉన్న వాంటేజ్ స్పోర్ట్ కూపేని ఆస్టన్ మార్టిన్ ఇండియాలో లాంచ్ చేసింది. ముందుగా దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకంటే ఇది మన ఊహకు అందని ధరతో లాంచ్ అయింది. ఈ బ్రిటీష్ కారు ఎక్స్-షోరూం ధర అక్షరాల రూ.3.99 కోట్లు. అప్ డేటెడ్ వాంటేజ్ లగ్జరీ కారు రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్, అప్ గ్రేడెడ్ పవర్ ట్రెయిన్, మరియు కొత్త ఇంటీరియర్ లుక్ ని పొందింది. వీటి డెలివరీని కూడా 2024 చివరి త్రైమాసికంలో ప్రారంభించడానికి ఆస్టన్ మార్టిన్ సంసిద్ధం అవుతుంది.
ఇందులో అందించబడిన అతి ముఖ్యమైన భాగం ఇంజిన్ విషయానికి వస్తే, బానెట్ కింద ఇది మెర్సిడెస్-ఎఎంజిలో అందించబడిన 4.0-లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ తో వచ్చింది. ఈ కారు టాప్ స్పీడులో దూసుకుపోయేందుకు ఇందులోని మోటార్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి 656bhp పవర్ మరియు 800Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ అవుట్ పుట్ ద్వారా, వాంటేజ్ కారు గంటకు 325కెఎంపిహెచ్ వేగంతో వెళ్తూ కేవలం 3.5 సెకన్లలో జీరో నుంచి 100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
డిజైన్ పరంగా, కొత్త వాంటేజ్ సూపర్ కారు భారీ గ్రిల్ తో మరింత అగ్రెసివ్ లుక్ ని పొందగా, ఇది పూర్తిగా ఫ్రంట్ బంపర్ అంతా కవర్ చేస్తుంది. బంపర్ కి ఇరువైపులా వర్టికల్ ఎయిర్ కర్టైన్స్, మరియు హై-పెర్ఫార్మెన్స్ అందించే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ వంటి వాటిని పొందింది. ఇంకా చెప్పాలంటే, ఈ టూ-డోర్ కూపే రివైజ్డ్ ఫెండర్ ఎయిర్ డక్ట్స్, కొద్దిగా రీడిజైన్ చేసినట్లు ఉండే రియర్ బంపర్, డిఫ్యూజర్, మరియు సాటిన్ సిల్వర్ కలర్ ఫినిషింగ్ తో వచ్చిన 21-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని పొందింది.
కొత్త వాంటేజ్ క్యాబిన్ లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇది పూర్తిగా రీవర్క్ చేసిన కాక్ పిట్ తో కొత్త ఇంటీరియర్ కలర్ ని కలిగి ఉంది. లోపల మెర్సిడెస్ లాంటి ఇంటీరియర్ తో కనిపిస్తుండగా, కొత్త వాంటేజ్ లగ్జరీ స్పోర్ట్స్ కారులో లభించే ఫీచర్లు చాలానే ఉన్నాయి. అందులో కొత్త యూజర్ ఇంటర్ ఫేస్ తో వచ్చిన కొత్త 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ మరియు త్రీ-డీ లైవ్ మ్యాపింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా, ఇందులో బోయర్స్ & విల్కిన్స్-సోర్స్డ్ 15-స్పీకర్ మ్యూజిక్ సిస్టం, కొత్త స్టీరింగ్ వీల్, చాలా వరకు కంట్రోల్ చేసేందుకు ఫిజికల్ టాగుల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ సీట్స్ మరియు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్