- మొదటిసారిగా మూడు స్క్రీన్ల సెటప్ తో వస్తున్న డ్యాష్ బోర్డు
- ఐసీఈ XUV700 సిల్హౌట్ తో రానున్న XUV700 ఈవీ
మహీంద్రా నుంచి ఎన్నో కొత్త కొత్త ఎలక్ట్రిక్ ప్రొడక్టులు రానుండగా, వాటిని ఎప్పటికప్పుడూ టెస్టింగ్ చేస్తూ ఆయా మోడళ్లకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. అయితే, అందులో XUV.e8 కూడా ఉండగా, మహీంద్రా నుంచి ప్రస్తుతం విక్రయించబడుతున్న XUV700 మోడల్ ని ఎలక్ట్రిక్ వెర్షన్లో తీసుకురానుంది. XUV.e9 వలె కాకుండా, ఇందులో ఎన్నో మార్పులను మహీంద్రా తీసుకురానుంది. XUV.e8 కారు డిజైన్ పరంగా మరియు ప్రొఫైల్ పరంగా ఐసీఈ వెర్షన్ నుంచి తీసుకున్నట్లు ఉంది.
కారు ముందు భాగాన్ని పరిశీలిస్తే, అప్ కమింగ్ (రాబోయే) XUV.e8 ఫేసియా భారీ లైట్ సెటప్ తో డామినేట్ చేసే విధంగా ఉండనుంది. అందులో కనెక్టింగ్ లైట్ బార్ తో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు నిలువుగా అమర్చిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. కనిపిస్తున్న ముఖ్యమైన అంశాలలోబానెట్, రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, మరియు ఎడాస్ (ఏడీఏఎస్) టెక్ తో రాడార్ వంటివి ఉన్నాయి.
ఇంకా వెనుక ప్రొఫైల్ గురించి చెప్పాలంటే, టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కొద్దిగా ఐసీఈ XUV700 లాగా అనిపిస్తుంది. ఇంకా, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ తో విశాలమైన రూఫ్ స్ప్పాయిలర్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, మరియు రియర్ ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం లభిస్తున్న XUV700 మోడల్ లో ఫ్యూయల్ లిడ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఈ ఛార్జింగ్ పోర్ట్ అందించబడింది.
అయితే, ఈ ఎస్‍యూవీ క్యాబిన్ అంతటా భారీ మార్పులు చోటుచేసుకోగా, XUV700 ఎలక్ట్రిక్ వెర్షన్ కారు పూర్తి డ్యాష్ బోర్డును కవర్ చేసే విధంగా మూడు స్క్రీన్ల సెటప్ తో రానుంది. ఇందులో మూడవ స్క్రీన్ కొత్తగా అందించబడనుండగా, మిగతా రెండు స్క్రీన్లను ఇది వరకే మనం ఇంజిన్-పవర్డ్ XUV700 కారులో చూశాము.
ఫీచర్ల పరంగా, XUV.e8 (XUV700 ఈవీ) కారు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, స్టోరేజ్‌తో రివైజ్డ్ సెంటర్ కన్సోల్ మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍వీఎం వంటి ఫీచర్లతో రానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్