- ఒకే ఒక్క టాప్-స్పెక్ వెర్షన్‌లో 5 కలర్ ఆప్షన్స్ తో అందించబడనున్న EV9
- 2024 అక్టోబర్, 3న ధరల ప్రకటన
అక్టోబర్ 3వ తేదీన కియా ఇండియా దాని ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో కార్నివాల్ మరియు EV9 అనే రెండు మోడళ్లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో రెండోది( EV9) ఫ్లాగ్‌షిప్ ఆల్-ఎలక్ట్రిక్ మూడు-వరుస ఎస్‌యూవీ కాగా, ఇది 6-సీట్స్ కాన్ఫిగరేషన్‌తో ఒకే టాప్-స్పెక్ GT-లైన్ ఏడబ్లూడీ వెర్షన్‌లో రానుంది. ఇప్పుడు, EV9 అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే, ఈ ఎస్‌యూవీయొక్క ఫీచర్ వివరాలను వెల్లడించింది. ఈ కథనంలో, అప్ కమింగ్ (రాబోయే) ఎస్‌యువి యొక్క టాప్ ఫీచర్లను మేము ఇప్పటికే లిస్ట్ చేసాము, వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కియా ఇతర మోడల్‌ల మాదిరిగానే, EV9 కూడా కీలకమైన ఫీచర్లను పొందుతుంది. దీని లోపలి భాగంలో, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ 12.3-ఇంచ్ స్క్రీన్స్, టచ్ ఆధారిత 5-ఇంచ్ హెచ్ విఎసి ప్యానెల్, డిజిటల్ ఐఆర్‍విఎం, మెరిడియన్-సోర్స్డ్ 14-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లేతో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ కీ, వంటి వాటితో 100కి పైగా ఫీచర్లతో కనెక్ట్ చేయబడిన టెక్ మరియు ఓటిఎ అప్‌డేట్స్ తోసహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఇతర ఫీచర్లు చూస్తే, ఈ కార్ క్యాబిన్ లోపల లెవెల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఇల్యూమినేటెడ్ ఎంబ్లమ్‌తో కూడిన ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, ట్విన్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, మెమరీ ఫంక్షన్‌తో 18-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 12-వే సర్దుబాటు చేయగల కో-డ్రైవర్ సీట్, వెంటిలేషన్ మరియు మసాజ్ ఫంక్షన్‌తో రెండవ వరుసలో పవర్డ్ కెప్టెన్ సీట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మూడవ వరుసకు రిక్లైన్ ఫంక్షన్, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు 10 ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్లను పొందుతుంది.
కియా EV9 కారుని 99.8kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే, ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్‌తో సుమారు 561కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. అలాగే, ఈ కాన్ఫిగరేషన్‌లో, EV9 కేవలం 5.3 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ స్ప్రింట్ వేగంతో 380bhp మరియు 700Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
అనువాదించిన వారు: రాజపుష్ప