- ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడ్డ 240 ఛార్జింగ్ పాయింట్లు
- ఇప్పుడు 8,500 ఛార్జర్లను ఇన్‌స్టాల్ చేయడానికి సన్నాహాలు
అదానీ ఎలక్ట్రిసిటీ ముంబైలో 8,500 ఈవీ ఛార్జర్లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై నగరంలోని అపార్ట్‌మెంట్లలో ఈ ఛార్జర్లను అమర్చనున్నారు. దీనితో పాటు, కంపెనీ 'షేర్ ఛార్జ్' అనే ఆప్షన్ ని కూడా ప్రారంభించింది. ఇది ఈవీ కార్ ఛార్జింగ్ సమస్య నుండి కస్టమర్లకు ఉపశమనం అందిస్తుంది.
అయితే దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి టైమ్‌లైన్ సమాచారాన్ని పేర్కొనలేదు. ఈ ఈవీఛార్జింగ్ పోర్ట్స్ ముంబై శివారులోని 4,000 హౌసింగ్ సొసైటీలలో మరియు 8,500 ఇతర ప్రదేశాలలో అమర్చబడతాయి. ఈ ఛార్జర్‌తో కారును ఛార్జ్ చేయడానికి 7 గంటలు మరియు బైక్‌కు 4 గంటల సమయం పడుతుంది.
అదానీ మరియు టాటా పవర్ సంయుక్తంగా “షేర్ ఛార్జ్” ప్రోగ్రాంని కూడా ప్రారంభించాయి, దీని కింద వెహికిల్ ఓనర్లు ఒకే ఛార్జింగ్ పోర్ట్‌ను ఉపయోగించవచ్చు మరియు వారి సౌలభ్యం ప్రకారం ఛార్జింగ్ సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. షేర్ ఛార్జ్ గరిష్ట ఛార్జింగ్ ఖర్చులను తగ్గిస్తుంది మరియు ఈవీ కార్ల అమ్మకాలను పెంచుతుంది. అదనంగా మీరు మీ ఈవీ ఎంత ఛార్జ్ అయిందో తెలుసుకోవడానికిమీరు ఛార్జింగ్‌ను ట్రాక్ చేయవచ్చు, మొబైల్ అప్లికేషన్ ద్వారా నేరుగా పేమెంట్స్ చేయవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్