- లగ్జరీ కేటగిరిలో ఒకటైన మోడల్ లెక్సస్ LM 350H
- దీని ఎక్స్-షోరూం ధర రూ. 2.5 కోట్లు
అటు కోలివుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమిళ సూపర్ స్టార్ విజయ్ తన కొత్త లెక్సస్ కారును కొనుగోలు చేశాడనే వార్త అభిమానులలో చాలా ఉత్కంఠను రేకెత్తించింది. తమిళ చిత్రసీమలోనే కాకుండా ఇటు తెలుగు చిత్రసీమలో కూడా సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్ తన సూపర్ స్టైలిష్ లుక్‌తో పాటు సినిమాలలో విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు.
సినీ నటుడు విజయ్ ఇటీవల కొనుగోలు చేసిన లెక్సస్ LM 350H ప్రీమియం ఎస్‌యూవీ లెక్సస్ మోడల్‌లో హైటెక్ సౌకర్యాలను కలిగి ఉండటంతో పాటు, రెండవ వరుసలో 48-ఇంచ్ అల్ట్రావైడ్ స్క్రీన్ అమర్చబడింది. అంతే కాకుండా, వెనుకవైపు మల్టీ-ఆపరేషన్ ప్యానెల్, అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫ్రారెడ్ మ్యాట్రిక్స్ సెన్సార్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, ఎయిర్‌లైన్-స్టైల్ రిక్లైనర్ సీట్స్ మరియు హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌స్ మరియు ఫుట్‌రెస్ట్‌తో రెండవ వరుసలో పవర్డ్ ఒట్టోమన్ సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
లెక్సస్ LM350h మోడల్2.5-లీటర్, ఫోర్-సిలిండర్, పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌ను పొందింది. ఇది 190bhp మరియు 240Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఆల్-ఫోర్వీల్ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా నాలుగు వీల్స్ కు పవర్ ని సప్లై చేస్తుంది.
విజయ్ లెక్సస్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఇంటర్నెట్ హీటెక్కింది. కొత్త కారు కొనుగోలుతో విజయ్ సక్సెస్ జర్నీలో మరో మైల్ స్టోన్ ని చేరుకున్నాడు.
అనువాదించిన వారు: రాజపుష్ప