- ప్రతి నెలా 10 వేలకు పైగా అందుకున్న బుకింగ్స్
- ప్రస్తుతం 16 నెలలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్
అక్టోబర్-2020 లో లాంచ్ కాగా, అప్పటి నుంచి మహీంద్రా థార్ ఇండియన్ ఆటో మార్కెట్లో తన హవాను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు, ఈ లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ దేశవ్యాప్తంగా దాని సెగ్మెంట్ లో మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీలలో ఒకటిగా నిలిచింది. పాపులారిటీ మరియు విపరీతమైన డిమాండ్ కారణంగా, నవంబర్-2023 వరకు మహీంద్రా థార్ 76 వేల బుకింగ్స్ సాధించింది. దీని గురించి ఇంకా చెప్పాలంటే, ఈ ఆటోమేకర్ నుండి వచ్చిన 3-డోర్ ఎస్‍యూవీ ప్రతి నెలా 10,000 వరకు బుకింగ్స్ అందుకుంటుంది.
ఇతర వార్తలలో చూస్తే, దేశంలో థార్ కు డిమాండ్ ఇంకా కొనసాగుతుండడంతో దీనిపై 16 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. ఇది ఆర్డబ్ల్యూడీ హార్డ్-టాప్ డీజిల్ వేరియంట్స్ పై అమలు కానుండగా, పెట్రోల్ వేరియంట్స్ పై బుకింగ్ చేసిన తేదీ నుంచి 5 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. ఎవరైతే కస్టమర్స్ 4డబ్ల్యూడీని కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు 6 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
మహీంద్రా థార్ ను పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ లో ఆర్డబ్ల్యూడీ మరియు 4డబ్ల్యూడీ కాన్ఫిగరేషన్స్ లో పొందవచ్చు. దీని పెట్రోల్ మిల్ 2.0-లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ కలిసి 150bhp మరియు 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఆయిల్ బర్నర్ 1.5-లీటర్ మరియు 2.0-లీటర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది. ఇంతకు ముందున్న ఇంజిన్ 117bhp మరియు 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దాని తర్వాత వచ్చిన ఇంజిన్ 130bhp పవర్ ని జనరేట్ చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్