- ఆగస్టు 15న ఇండియన్ మార్కెట్‌లోకి రానున్న 5-డోర్ థార్
- సన్‌రూఫ్ తో వచ్చే అవకాశం
మహీంద్రా దాని లైఫ్‌స్టైల్ ఎస్‍యూవీఫైవ్-డోర్ థార్‌ను ఆగస్టు 15న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. అంతకు ముందుగా మహీంద్రా కంపెనీ దీనిని టెస్టింగ్ చేయడంలో చాలా బిజీగా ఉంది. ఇంటర్నెట్లో కనిపించే కొత్త స్పై ఫోటోలు ఈ మోడల్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్ల గురించి సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి.
ఇక్కడ ఫోటోలలో చూసిన విధంగా, రాబోయే (అప్‍కమింగ్) థార్ ఫైవ్-డోర్ టెస్ట్ మ్యూల్ ఐఆర్‌విఎం రియర్ కెమెరా సెటప్‌ను మనకు వెల్లడిస్తుంది. ఈ యూనిట్ ఎడాస్ (ఏడీఏఎస్) కోసం ఉపయోగించబడే అవకాశం ఉంది, దీంతో ఈ మోడల్ లాంచ్ సమయానికి ఎడాస్ సూట్ ని అందుకోవచ్చని దీని ద్వారా మనకు తెలుస్తుంది.
అంతే కాకుండా మిగతా వాటిని పరిశీలిస్తే, ఫైవ్-డోర్ మహీంద్రా థార్ టెస్ట్ మ్యూల్‌లో సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కొత్త గ్రిల్, సర్క్యులర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్, త్రీ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ మరియు ఫాగ్ లైట్లు ఉన్నాయి. అలాగే, కొత్త అల్లాయ్ వీల్స్, ఎ-పిల్లర్-మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్స్, సర్క్యులర్ ఏసీ వెంట్స్, ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్స్ మరియు టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ కూడా ఇందులో అందించబడనున్నాయి.
బానెట్ కింద, మహీంద్రా థార్ కొత్త ఇటరేషన్ ఇంతకు ముందు లాగే అదే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ని 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జత చేయబడి అందించబడుతుందని భావిస్తున్నాం.
చిత్ర మూలం
అనువాదించిన వారు: సంజయ్ కుమార్