- అందుబాటులో ఉన్న 6 వేరియంట్స్
- రూ.10.70లక్షలు(ఎక్స్-షోరూం)తో ధరలు ప్రారంభం
గత సంవత్సరం సెప్టెంబరులో మారుతి సుజుకి గ్రాండ్ విటారా మొదటిసారిగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. సంవత్సరంలోపే ఈ మిడ్ సైజ్ ఎస్యువికి సంబంధించి ఒక లక్షా 20 వేలకు పైగా యూనిట్లను విక్రయించింది. అన్ని వైపుల నుంచి దీనికి విపరీతంగా డిమాండ్ పెరగడంతో హ్యుందాయ్ క్రెటాకు పోటీగా 23,000 ఓపెన్ బుకింగ్స్ సాధించింది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా 6 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి ఏంటి అంటే సిగ్మా, డెల్టా. జీటా, జీటా ప్లస్, ఆల్ఫా మరియు ఆల్ఫా ప్లస్. అదే విధంగా దీని ప్రారంభ ధర రూ. 10.70 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. అలాగే ఈ ఎస్యువిని పొందాలంటే బుకింగ్ తేదీ నుంచి కనీసం 8 వారాల వరకు కస్టమర్స్ వేచి ఉండాల్సి ఉంటుంది.
మెకానికల్ గా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ ను కలిగి ఉంది. ఇంతకు ముందున్నది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ని జత చేయబడి ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇందులో ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ మోటార్ ఈ-సివిటి యూనిట్ తో జత చేయబడి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ ఎస్యువి డెల్టా మరియు జీటా వేరియంట్స్ లో సిఎన్జి పవర్ ట్రెయిన్ ఆప్షన్ ను కూడా కలిగి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్