- నాలుగు వేరియంట్లలో అందించబడిన 2025 మెరిడియన్
- బేస్ వేరియంట్ తో 5-సీటర్ వెర్షన్ ని పొందిన మిడ్-లైఫ్ అప్ డేటెడ్ మోడల్
కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా మెరిడియన్ ఎస్‍యూవీ మిడ్-లైఫ్ అప్ డేటెడ్ మోడల్ ని రూ.24.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ అప్ డేటెడ్ మెరిడియన్ ఎస్‍యూవీ 5-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (O), మరియు ఓవర్ ల్యాండ్ అనే నాలుగు వేరియంట్లలో అందించబడింది.
ఎక్స్‌టీరియర్ పరంగా, బయటి వైపు కొత్త మెరిడియన్ కారును ఆటోమేకర్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది స్లాట్ గ్రిల్, డీఆర్ఎల్స్ తో సన్నని ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, వెర్షన్ కి తగ్గట్లు వివిధ ప్యాటర్న్ లతో 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, సన్నని ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ తో ఒకే రకమైన ఫేసియాను పొందింది.
ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త మెరిడియన్ కారు కొత్త టెక్నాలజీతో ఎన్నో రకాల ఫీచర్లను పొందింది. అందులో లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్)సూట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అందించిన ఇతర హైలైట్లలో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10.2-ఇంచ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు, ఎంట్రీ-లెవెల్ లాంగిట్యూడ్ వేరియంట్ 5-సీటర్ కాన్ఫిగరేషన్లో మాత్రమే అందించబడింది. అన్నీ ఇతర వేరియంట్లు స్టాండర్డ్ గా 7-సీట్ కాన్ఫిగరేషన్లో అందించబడ్డాయి. ముఖ్యంగా, బేస్ వేరియంట్లో పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు సన్ రూఫ్ వంటి కొన్ని ఫీచర్లు మిస్ అయ్యాయి.
మెకానికల్ గా, అప్ డేటెడ్ మెరిడియన్ కారులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జత చేయబడి వచ్చింది. ఈ మోటార్ 168bhp మరియు 350Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ కారు ఇంతకు ముందు 4x2 మరియు 4x4 వెర్షన్లలో అందించబడింది.
వేరియంట్-వారీగా అప్ డేటెడ్ జీప్ మెరిడియన్ కారు ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్(5-సీటర్) – రూ.24.99 లక్షలు
జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్ ప్లస్ – రూ.27.5 లక్షలు
జీప్ మెరిడియన్ లిమిటెడ్ (O) – రూ.30.49 లక్షలు
జీప్ మెరిడియన్ ఓవర్ ల్యాండ్ – రూ.36.49 లక్షలు