- 5-సీటర్ మరియు 7-సీటర్ లేఅవుట్ కాన్ఫిగరేషన్లలో అందించబడుతున్న అప్ డేటెడ్ మోడల్
- కొత్త అప్ డేట్లో హైలైట్ గా నిలిచిన లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్)
ఇండియన్ మార్కెట్లో జీప్ ఇండియా కార్ల కంపెనీ నుంచి ఎన్నో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్తగా జీప్ ఇండియా మెరిడియన్ మోడల్ లో అప్ డేటెడ్ వెర్షన్ ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వీటికి సంబంధించిన బుకింగ్స్ రెండు రోజుల క్రితమే ప్రారంభంకాగా, మరికొన్ని వారాల్లో మెరిడియన్ కారు ధరలను ప్రకటించే అవకాశం ఉంది. 2025 అప్ డేట్ ద్వారా, మెరిడియన్ కారు లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ తో పాటుగా మరెన్నో ఫీచర్లను పొందనుంది.
అప్ డేటెడ్ జీప్ మెరిడియన్ కారు 5-సీటర్ మరియు 7-సీటర్ లేఅవుట్ కాన్ఫిగరేషన్లలో అందించబడుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారు 30కి పైగా కనెక్టెడ్ మరియు రిమోట్ తో ఆపరేట్ చేసే విధంగా వివిధ రకాల ఫంక్షన్లతో, అలాగే, లెవెల్- 2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, స్టాండర్డ్ గా 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో రానుంది. అదే విధంగా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.2-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్పైన్-సోర్స్డ్ 9-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లను కూడా ఇందులో మనం చూడవచ్చు.
మెకానికల్ గా, కొత్త జీప్ మెరిడియన్ కారు ఇంతకు ముందున్న పవర్ ట్రెయిన్ మరియు గేర్ బాక్సు ఆప్షన్లతో రానుంది. ఇంకా చెప్పాలంటే. మెరిడియన్ కారు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో రాగా, దీనిని 6-స్పీడ్ మాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో జతచేసి పొందవచ్చు. ఇది నాలుగు వేరియంట్లలో 4x2 మరియు 4x4 టైపులలో అందించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్