- కొత్త వేరియంట్‌లను పరిచయంచేయనున్న టాటా
- మెకానికల్‍గా ఎటు వంటి మార్పులు లేవు
టాటా నుంచి వచ్చిన పాపులర్ మోడళ్లలో ఒకటైన పంచ్ ఎస్‌యువి కొత్త మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను పొందడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా ఇప్పటికే ఉన్న పంచ్ లైనప్ లో మరిన్ని ఫీచర్లు మరియు కొత్త వేరియంట్‌లను టాటా చేర్చనుంది. అలాగే, 2024లో అప్‌డేట్ చేసిన కొత్త టాటా పంచ్ బ్రోచర్ వివరాలను మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ కొత్త అప్‌డేట్ వివరణలో పూర్తి ఫేస్‌లిఫ్ట్ మైక్రో-ఎస్‌యువి ఎక్స్‌టీరియర్ వివరాలు అందుబాటులో లేవు.
ముందుగా టాటా పంచ్ వేరియంట్స్ నుంచి ప్రారంభిస్తే, ప్యూర్, ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ S, అడ్వెంచర్+ S, అకాంప్లిష్డ్+, అకాంప్లిష్డ్+ S, క్రియేటివ్+, మరియు క్రియేటివ్+ S అనే వేరియంట్‌లలో కొత్త పంచ్ కారు అందించబడుతుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త పంచ్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద 12.5-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సిక్స్-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఫాస్ట్ టైప్- సి ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్స్, మరియుఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ సన్‌రూఫ్ లను వంటి వివిధ ఫీచర్స్ పొందనుంది.
మెకానికల్‍గా, పంచ్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్లతో కొనసాగుతుంది. ఈ రెండు ఇంజన్‌లు 5 -స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తోజత చేయబడి అందించబడతాయి. అలాగే, పెట్రోల్ వెర్షన్ మోటార్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో మాత్రమే పరిమితం చేయబడుతుంది.
వివరాలు | టాటా పంచ్ | టాటా పంచ్ సిఎన్‌జి |
ఇంజిన్ | 1.2-లీటర్ పెట్రోల్ | 1.2-లీటర్ పెట్రోల్+సిఎన్‌జి |
ట్రాన్స్‌మిషన్ | 5-స్పీడ్ మాన్యువల్/ఏఎంటి | 5-స్పీడ్ మాన్యువల్ |
పవర్ అవుట్‌పుట్ | 85bhp/115Nm | 72bhp/103Nm |
అప్‌డేటెడ్ టాటా పంచ్ వేరియంట్స్ వారీగా పవర్‌ట్రెయిన్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | పెట్రోల్ ఎంటీ | సిఎన్‌జి | పెట్రోల్ ఏఎంటీ |
ప్యూర్ | ఉంది | ఉంది | లేదు |
ప్యూర్ (O) | ఉంది | లేదు | లేదు |
అడ్వెంచర్ | ఉంది | ఉంది | ఉంది |
అడ్వెంచర్ రిథమ్ | ఉంది | ఉంది | ఉంది |
అడ్వెంచర్ S | ఉంది | ఉంది | ఉంది |
అడ్వెంచర్+ S | ఉంది | ఉంది | ఉంది |
అకాంప్లిష్డ్+ | ఉంది | ఉంది | ఉంది |
అకాంప్లిష్డ్+ S | ఉంది | ఉంది | ఉంది |
క్రియేటివ్+ | ఉంది | లేదు | ఉంది |
క్రియేటివ్+ S | ఉంది | లేదు | ఉంది |
అనువాదించిన వారు: రాజపుష్ప