- ప్రస్తుత వెర్షన్ కంటే కొంత మెరుగైన ఫీచర్ అప్ డేట్స్ తో వచ్చిన 2024 పంచ్
- వేరియంట్ లైనప్ లో మార్పులు
ఇండియాలో అప్ డేటెడ్ పంచ్ కారును టాటా మోటార్స్ లాంచ్ చేయగా, వీటి ధరలు రూ.6.12 లక్షలతో (ఎక్స్-షోరూం, ముంబై) ప్రారంభమయ్యాయి. సిట్రోన్ C3 మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లతో పోటీపడుతున్న బి-ఎస్‍యూవీ కారు మరిన్ని మెరుగైన ఫీచర్లతో మరియు వేరియంట్ రేంజ్ లో మార్పులతో వచ్చింది. ప్రస్తుతం, 2025-ఆర్ధిక సంవత్సరంలో టాటా పంచ్ కారు నాలుగు లక్షలకు పైగా అమ్ముడుపోయి దేశంలోనే నెంబర్ వన్ కారుగా నిలిచింది.
ఇందులో అందించబడిన ఫీచర్లతో ప్రారంభిస్తే, 2024 పంచ్ కారు సెంట్రల్ కన్సోల్‌లో యూఎస్‍బీటైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లేమరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీవెంట్స్ మరియు కారు ముందు వరుసలో ఒక ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లతో వచ్చింది.
వేరియంట్ల పరంగా చూస్తే, అప్ డేటెడ్టాటా పంచ్ కారు ఇప్పుడు 10 రకాల ఆప్షన్లతో అందుబాటులో ఉంది – అందులో ప్యూర్, ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ S, అడ్వెంచర్+ S, అకాంప్లిష్డ్+, అకాంప్లిష్డ్+ S, క్రియేటివ్+ మరియు క్రియేటివ్+ ఎస్ వంటి వేరియంట్లు ఉన్నాయి. ప్రస్తుతం విక్రయించబడుతున్న పంచ్ కారు ఎన్ని కలర్లలో లభిస్తుందో లేటెస్ట్ 2024 పంచ్ కారు కూడా అన్ని కలర్లలో లభిస్తుంది.
2024 టాటా పంచ్ కారు ఇంతకు ముందున్న మోడల్ లాగే ఇప్పుడు కూడా 1.2-లీటర్, 3-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్‌లతో జత చేసి పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ కారు సిఎన్‍జి వెర్షన్లో కూడా అందించబడగా, మొత్తంగా ఏడు వెర్షన్లలో అందించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్