- రూ.21 వేలతో పంచ్ ఈవీ బుకింగ్స్ ఓపెన్
- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభ్యంకానున్న పంచ్ ఈవీ
మరికొన్ని వారాల్లో టాటా పంచ్ ఈవీ లాంచ్ జరగనుండగా దాని కంటే ముందుగా టాటా మోటార్స్ దీనికి సంబంధించి వేరియంట్-వారీ ఫీచర్లను వెల్లడించింది. సిట్రోన్ eC3తో పోటీ పడుతున్న టాటా పంచ్ ఈవీని ప్రస్తుతం రూ. 21 వేలతో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
కొత్త పంచ్ ఈవీ స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే 5 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది 5 కలర్స్(అన్ని డ్యూయల్-టోన్ ఆప్షన్స్)లో కూడా అందించబడుతుంది, వీటికి సంబంధించిన వివరాలు మాకార్‌వాలే వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఈ పవర్డ్ మోడల్ స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ అనే 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో రానుంది. ఇప్పుడు మనం 2024 పంచ్ ఈవీ యొక్క వేరియంట్-వారీ కీలక ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దాం.
పంచ్ ఈవీ స్మార్ట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ స్మార్ట్ డిజిటల్ డీఆర్ఎల్స్ మల్టీ-మోడ్ రీజెన్ ఫంక్షన్ ఈఎస్‍పీ 6 ఎయిర్ బ్యాగ్స్ |
పంచ్ ఈవీ స్మార్ట్+ ఫీచర్స్ వెల్లడించాల్సి ఉంది |
పంచ్ ఈవీ అడ్వెంచర్ క్రూయిజ్ కంట్రోల్ కార్నరింగ్ ఫంక్షన్ తో ఫ్రంట్ ఫాగ్ లైట్స్ హార్మన్ 7-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఆటో-హోల్డ్ ఫంక్షన్ తో ఈపీడీ (లాంగ్ రేంజ్ లో మాత్రమే) జ్యూవెల్డ్ కంట్రోల్ నాబ్ (లాంగ్ రేంజ్ లో మాత్రమే) సన్‍రూఫ్ (ఆప్షనల్) |
పంచ్ ఈవీ ఎంపవర్డ్ 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఏక్యూఐడిస్‌ప్లేతో ఎయిర్ ప్యూరిఫైయర్ ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌విఎం 7-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ SOS ఫంక్షన్ సన్‌రూఫ్ (ఆప్షనల్) |
పంచ్ ఈవీ ఎంపవర్డ్+ లెదరెట్ సీట్లు 360-డిగ్రీ కెమెరా బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వైర్ లెస్ ఛార్జర్ 10.25-ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్