- రూ.16.99 లక్షల ధరతో అందుబాటులో ఉన్న టాప్-స్పెక్ వేరియంట్
- 4 వేరియంట్స్ లో అందిచబడుతున్న మోడల్
టాటా మోటార్స్ అప్‌డేటెడ్ నెక్సాన్ ఈవీని రూ. 13.99 లక్షలు ప్రారంభ ధరతో ఇండియాలో నేడే లాంచ్ చేసింది. ఈ అప్‌డేట్ లిస్టులో కారు ఛార్జింగ్ సమయం, డ్రైవింగ్ రేంజ్ మరియు హై వోల్టేజ్ సేఫ్టీ ప్రమాణాలను పెంచే ప్రిస్మాటిక్ సెల్‌లతో 45kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలను తెలుసుకుంద్దాం.
బ్యాటరీ ప్యాక్ గురించి చెప్పాలంటే, టాటా కర్వ్ ఈవీలో చూసిన కొత్త 45kWh ని కలిగి ఉంది. ఇది క్లాస్-లీడింగ్ వాల్యూమెట్రిక్ డెన్సిటీ 186wh/lit మరియు 15 శాతం అధిక ఎనర్జీ ని కలిగి ఉంది. దీని ప్రిస్మాటిక్ సెల్ ఫార్మాట్ మరింతగా బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే,ఇది ఛార్జింగ్ సమయాన్ని 29 శాతం (56నిమిషాల నుండి 40నిమిషాల) వరకు తగ్గిస్తుంది. మునుపటిది 465కిలోమీటర్ల వరకు క్లెయిమ్ చేసిన రేంజ్ నిఅందిస్తుంది. అయితే ఈ కొత్తది దాని C75 (రియల్ వరల్డ్ అంచనా) రేంజ్ 350-370కిలోమీటర్లతో పూర్తి ఛార్జింగ్‌తో 489కిలోమీటర్లను కలిగి ఉంది.
ఇప్పుడు నెక్సాన్ ఈవీ 1.2C వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్ ను కలిగి ఉంది. అలాగే, ఇది 60kW కంటే ఎక్కువ ఛార్జర్‌ని ఉపయోగిస్తుంది. దీని కారణంగా కేవలం 40 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగా,ఇది కేవలం 15నిమిషాలలో 130కిలోమీటర్ల వరకు డ్రెవింగ్ రేంజ్ ని అందించగలదు. ఆలాగే ఈ కారులో పెర్ఫార్మెన్స్ మరియు డ్రైవ్ మోడ్స్ ,పాడిల్-షిఫ్టర్‌ల ద్వారా రీజెన్‌లతో ఎక్కువ లేదా తక్కువ ఒకే విధంగా ఉంటాయి.
ఫీచర్ల విషయానికి వస్తే, టాటా నెక్సాన్ ఈవీని ప్రస్తుతానికి (వాస్తవానికి)ఈ కారును కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్న కస్టమర్లు ఇప్పుడు బ్లాక్ మరియు రెడ్ కలర్ తో కూడిన కొత్త 'Red #Dark' వేరియంట్‌ని అదనంగా రూ. 20,000 కంటే ఎక్కువ దరతో పొందవచ్చు. ఇంతేకాకుండా, నెక్సాన్ ఈవీ 45 మోడల్ క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ + అనే మోడల్ 4 వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది.
వేరియంట్స్ వారీగా 2024 టాటా నెక్సాన్ ఈవీ 45 (అన్ని ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూమ్ దరలు |
క్రియేటివ్ 45 | రూ. 13.99 లక్షలు |
ఫియర్‌లెస్ 45 | రూ. 14.99 లక్షలు |
ఎంపవర్డ్ 45 | రూ. 15.99 లక్షలు |
ఎంపవర్డ్ + | రూ. 16.99 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప