- 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్, 360-డిగ్రీ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లను అందిస్తున్న ఆల్ట్రోజ్ రేసర్
- పరిచయం చేయబడ్డ 4 కొత్త వేరియంట్స్
టాటా మోటార్స్ 7 జూన్, 2024న పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ ఆల్ట్రోజ్ రేసర్‌ను లాంచ్ చేయడానికి షెడ్యూల్ చేయగా, దాని కంటే ముందు ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌డేట్ చేసింది. సరికొత్త అప్‌డేట్‌తో, ఆల్ట్రోజ్ 4 కొత్త వేరియంట్స్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో కొత్తగా మార్పులను తీసుకుని రాగా, అప్ కమింగ్ (రాబోయే) ఆల్ట్రోజ్ రేసర్ నుండి డైరెక్టుగా కొత్త ఫీచర్లను తీసుకుంది.
2024 టాటా ఆల్ట్రోజ్ XE, XM, XM S, XM+, XM+ S, XT, XZ, XZ లక్స్ , XZ+ S, XZ+ S లక్స్ మరియు XZ+ OS అనే 11 వేరియంట్‌లలో లభిస్తుంది. మరో విషయం ఏమిటంటే, ఇందులో చివరి 4 వేరియంట్స్ ప్రస్తుతం ఉన్న లైనప్‌లోకి జోడించబడ్డాయి.
ఫీచర్ల విషయానికొస్తే, 2024ఆల్ట్రోజ్ ఇప్పుడు పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, కొత్త యూజర్ ఇంటర్ ఫేస్ (యుఐ)తో 7- ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి వాటితో లోడ్ చేయబడింది.
మెకానికల్‍గా, ఆటోమేకర్ స్టాండర్డ్ ఆల్ట్రోజ్ నుండి టర్బో-పెట్రోల్ మోటార్ ను తొలగించింది. ఇది కాకుండా, ఆల్ట్రోజ్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌తో ఐసిఎన్‍జి మరియు 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో కొనసాగుతుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ డిసిటి గేర్ బాక్సు ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప