- 4 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ట్రైబర్
- మరిన్ని కొత్త ఫీచర్స్ మరియు కలర్ ఆప్షన్స్ దీని సొంతం
2024అప్డేట్ తో రెనాల్ట్ ఇండియా తన రేంజ్ మోడల్స్ అన్నింటిని రీఫ్రెష్ చేసింది. అందులో క్విడ్, కైగర్, మరియు ట్రైబర్ మోడల్స్ కొత్త ధరతో మరిన్ని ఫీచర్ అప్గ్రేడ్స్ ను అందుకుంటున్నాయి. దీంతో, ఎవరైనా కొనుగోలు చేయగల ఈ 7-సీటర్ కొత్త ట్రైబర్ ఇప్పుడు రూ.5.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.
2024 రెనాల్ట్ ట్రైబర్ ని RXE, RXL, RXT, మరియు RXZ అనే 4 వేరియంట్లలో పొందవచ్చు. అప్డేట్ పరంగా, ఈ ఎంపివి కైగర్ ఆధారంగా తీసుకోబడిన కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, డ్రైవర్ ఆర్మ్రెస్ట్ మరియు పవర్డ్ ఓఆర్విఎం వంటి కొత్త ఫీచర్ను పొందింది. ఇంకా చెప్పాలంటే, స్టాండర్డ్ కలర్ ఆప్షన్స్ లో మాత్రమే కాకుండా, ఈ అప్డేటెడ్ ట్రైబర్ కొత్త స్టెల్త్ బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్ లో కూడా అందుబాటులోకి వచ్చింది.
మెకానికల్ గా, కొత్త ట్రైబర్ కూడా ఇంతకు ముందు ఉన్న పవర్డ్ 1.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్స్ తో జత చేయబడి వచ్చింది. అలాగే, ఈ మోటార్ 72bhp పవర్మరియు 96Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది.
కొత్త వేరియంట్-వారీగా 2024 రెనాల్ట్ ట్రైబర్ యొక్క ఎక్స్-షోరూం ధరలు దిగువన లిస్టులో ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధరలు |
RXE ఎంటి | రూ. 5.99 లక్షలు |
RXL ఎంటి | రూ. 6.80 లక్షలు |
RXT ఎంటి | రూ. 7.60 లక్షలు |
RXT ఎటి | రూ. 8.12 లక్షలు |
RXZ ఎటి | రూ. 8.22 లక్షలు |
RXZ ఎటి | రూ. 8.74 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్