- ఇండియాలో అత్యంత చవకగా లభించనున్న ఆటోమేటిక్ కారు
- స్టాండర్డ్ గా 14సేఫ్టీ ఫీచర్లతో లభ్యం
రెనాల్ట్ ఇండియా 2024క్విడ్ ను దేశం అంతటా రూ. 4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ ధరలు మారనప్పటికీ, ఆటోమేకర్ ఫీచర్ లిస్ట్ ను అప్‌డేట్ చేయడంతో పాటుగా మూడు కొత్త డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్స్ ని దీనికి జత చేసింది.
అప్‌డేట్స్ పరంగా చూస్తే, 2024 మోడ్ పరిచయంతో, క్విడ్ యొక్క RXL(O) వేరియంట్ ఇప్పుడు 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ మీడియా నావిగేషన్ సిస్టమ్‌ను పొందింది, ఈ ఫీచర్‌తో దేశంలోనే అత్యంత చవకగా లభించే సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. దీనికి అదనంగా, ఈ వేరియంట్ ఇప్పుడు ఎఎంటి గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది, దీంతోఇండియాలో అత్యంత చవకగా ఆటోమేటిక్ కారును అందిస్తున్న వాటిలో రెనాల్ట్ తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు 14 సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తుంది.
దీని క్రింది హుడ్ లో, ఇంతకు ముందు ఉన్న ఇంజిన్ లాగే2024 రెనాల్ట్ క్విడ్ 1.0-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ 67bhp పవర్ మరియు 91Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఈ మోటార్‌ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటి యూనిట్‌తో జతచేయవచ్చు.
వేరియంట్ వారీగా 2024 రెనాల్ట్ క్విడ్ యొక్క ఎక్స్-షోరూం ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
RXE ఎంటి | రూ.4.69 లక్షలు |
RXL(O) ఎంటి | రూ. 4.99 లక్షలు |
RXL(O) ఎఎంటి | రూ. 5.44 లక్షలు |
RXT ఎంటి | రూ. 5.50 లక్షలు |
RXT ఎఎంటి | రూ. 5.95 లక్షలు |
క్లైంబర్ ఎంటి | రూ. 5.87 లక్షలు |
క్లైంబర్ ఎఎంటి | రూ. 6.12 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప