- కొడియాక్ కి పోటీగా త్వరలో రానున్న నిసాన్ X-ట్రైల్
- సిబియు మోడల్ గా ఇండియాలో దిగుమతికానున్న నయా మోడల్
ఇండియాలో X-ట్రైల్ మోడల్ ని లాంచ్ చేయడానికి నిసాన్ కంపెనీ వేగాన్ని పెంచింది. ఎలా అంటే, కొన్ని రోజుల క్రితం నిసాన్ X-ట్రైల్ మోడల్ కి సంబంధించి ఒక టీజర్ ని రిలీజ్ చేయగా, ఇప్పుడు అదే మోడల్ కి సంబంధించి మరో టీజర్ ని రిలీజ్ చేసింది. ఇది ఫోర్త్-జనరేషన్ X-ట్రైల్ మోడల్ కాగా, 2021 నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో విక్రయించబడుతుంది.
ముందుగా పేర్కొన్నట్లుగా X-ట్రైల్ మోడల్ 1.5-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో అందించబడుతుంది. ఈ ఇంజిన్ 201bhp పవర్మరియు 305Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, కారు ఇంజిన్ కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్(సివిటి)తో జతచేయబడి రానుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, నిసాన్ ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్లూడీ)ని అందిస్తుంది. ఇంతకు ముందు ఇండియాలో ప్రదర్శించిన X-ట్రైల్ ఈ-పవర్ హైబ్రిడ్ ని తీసుకురావాలని నిసాన్ కంపెనీ భావిస్తుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో రానుండగా, ప్రతి యాక్సిల్ పై ఒకటి చొప్పున రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో రానుంది.
ఇక్కడ టీజర్ ద్వారా మనకు లభించే చిన్న క్లూ ఏంటి అంటే, ఇది ఎలాంటి కాస్మోటిక్ అప్ డేట్స్ లేకుండా రానుంది. అదే విధంగా, ఇది కంప్లీట్ బిల్ట్ యూనిట్ (సిబియు)గా ఇండియాలో దిగుమతి కానుంది. లాంచ్ తర్వాత, ఈ ఎస్‍యూవీ స్కోడా కొడియాక్ తో పోటీపడనుండగా, దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా రావాల్సి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్