2024 సంవత్సరంలో వివిధ కార్ల తయారీ సంస్థల నుంచి ఎన్నో కార్లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే, ఇప్పుడు మనం ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన రెనాల్ట్ కైగర్ మరియు ఇటీవలే లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ గురించి చర్చించబోతున్నాం. ఈ రెండు కార్లలో ఏది తక్కువ బడ్జెట్ లో లభిస్తుంది మరియు ఏ కారు ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది అనే సరికొత్త విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనాల్ట్ కైగర్: వేరియంట్లు & ధరలు
నిస్సాన్ మాగ్నైట్ ని రూ.7.21లక్షల(ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. ఈ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి -విసియా, విసియా+, అసెంటా, N-కనెక్టా, టెక్నా మరియు టెక్నా+ అనే6 కొత్త వేరియంట్‌లలో లభిస్తుంది.
2024 అప్‍డేట్ కైగర్ రూ.7.22లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇది RXT (O) మాన్యువల్, RXT (O) సివిటి, RXL మాన్యువల్, RXL ఎఎంటి అనే 4 వేరియంట్స్ లో లభిస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనాల్ట్ కైగర్: టాప్ ఫీచర్స్
ఫీచర్ల విషయానికొస్తే, మాగ్నైట్ కారుఅప్‌డేట్ చేయబడిన యూఐతో 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ 8- ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, మెరుగైన సీట్ కుషనింగ్ మరియు కంఫర్ట్, యాంబియంట్ లైటింగ్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, రిమోట్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ను పొందింది. అలాగే, బెజెల్-లెస్ ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా పొందింది. అంతేకాకుండా, ఈ కారు అందించబడిన ముఖ్యమైన ఫీచర్లలో ఎల్ఈడీ మూడ్ లైట్, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, జెబిఎల్స్ స్పీకర్, ఎల్ఈడీస్క్యూ ప్లేట్ డాష్ క్యామ్ వంటివి ఉన్నాయి.
కైగర్ ఫీచర్ల విషయానికొస్తే, 2024 కైగర్ క్యాబిన్ లో కొత్తగా లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో పాటుగా సెమీ-లెదరెట్ సీట్స్, అలాగే, ఈ ఎస్‍యూవీలో ఇప్పుడు రెడ్ బ్రేక్స్ కాలిపర్స్, బెజెల్-లెస్ ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, మరియు ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌విఎంలతో వెల్ కం మరియు గుడ్ బై ఫంక్షన్లు కూడా ఉన్నాయి.
నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనాల్ట్ కైగర్: సేఫ్టీ ఫీచర్స్
సేఫ్టీ ఫీచర్లలో మాగ్నైట్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తోఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ కనెక్టివిటీతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ని పొందింది.
సేఫ్టీ ఫీచర్ల పరంగా, కైగర్ మోడల్, 4ఎయిర్‌బ్యాగ్స్,ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తోరియర్ పార్కింగ్ సెన్సార్‌లతో కూడినఏబీఎస్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్, స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్ మరియు చైల్డ్ సీట్ కోసం ఐసోఫిక్స్ ఎంకరేజ్ పాయింట్స్ వంటిని పొందింది. అలాగే ,ఇందులో అర్బన్ నైట్ ఎడిషన్ కూడా 9.6-ఇంచ్ ఐఆర్‍విఎంని పొందింది.
నిస్సాన్ మాగ్నైట్ రెనాల్ట్ కైగర్ సేఫ్టీ రేటింగ్స్ తో పోల్చి చూస్తే, క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ల కోసం నిస్సాన్ మాగ్నైట్ ఇంకా క్రాష్ టెస్ట్ చేయలేదు. కైగర్ మాత్రం బిఎన్ క్యాప్ టెస్టింగ్ లో అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీలో 4 స్టార్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీలో 2 స్టార్ స్కోర్ చేసిందని నిర్ధారించబడింది.
నిస్సాన్ మాగ్నైట్ వర్సెస్ రెనాల్ట్ కైగర్: పవర్ ట్రెయిన్
మెకానికల్‍గా, మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అదే 1.0- లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందించబడింది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడినప్పటికీ, మొదటిది ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అందించబడింది. గరిష్టంగా మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ కారు 100bhp మరియు 160nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా,టర్బో-పెట్రోల్ మోటార్ సివిటి యూనిట్‌ను కూడా పొందింది.
మెకానికల్‍గా, కైగర్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ టర్బో పెట్రోల్ ఇంజిన్లతో అందించబడింది. ఈ ఇంజన్లు సివిటి స్పోర్ట్ లేదా మాన్యువల్ మోడ్‌ను పొందాయి. గరిష్టంగా రెనాల్ట్ కైగర్ కారు 100bhp మరియు 160nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.