- ధరలో ఎలాంటి మార్పులు లేకుండా వచ్చిన ఫేస్‍లిఫ్టెడ్ మోడల్
- కొత్త పేర్లతో వచ్చిన వేరియంట్లు
2020లో నిసాన్ మాగ్నైట్ లాంచ్ అయిన తర్వాత ఇండియాలో కార్ల కంపెనీల భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 2024లో, నిసాన్ నుంచి వచ్చిన మాగ్నైట్ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌ను రూ. 5.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో మీకు పరిచయం చేస్తున్నాము. ఈ పిక్చర్ గ్యాలరీ ద్వారా ఇందులో కొత్తగా అందించబడిన ఫీచర్లు మరియు అన్ని కాస్మెటిక్ అప్ డేట్స్ వంటి వివరాలను పరిశీలిద్దాం.
నిసాన్ మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్ ఫోటో గ్యాలరీ
ముందుగా దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ తో ప్రారంభిస్తే, దీని డిజైన్ కొంచెం అటు ఇటుగా మొత్తానికి బాగానే ఉంది. కానీ కొద్దిగా నిప్ మరియు టక్ లుక్ ని కలిగి ఉంది. 2024 మాగ్నైట్ లో అందించబడిన కొత్త ఫ్రంట్ గ్రిల్ బ్లాక్ పియానో యాక్సెంట్స్ మరియు కారుకు ఇరువైపులా క్రోమ్ ఇన్‌సర్ట్‌లను కలిగి ఉంది.
ఆ తర్వాత, ఇందులోఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో షార్ప్ గా కనిపించే ఎల్ఈడీహెడ్‌ల్యాంప్‌లు మరియు రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. రెండోది ఏంటి అంటే, ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ స్కిడ్ ప్లేట్‌ను పొందింది.
ప్రక్కన, సిల్హౌట్ ని చూస్తే, ఓల్డ్ నిసాన్ మాగ్నైట్ వలె ఉంది, అయితే 2024 మోడల్ కొత్త డిజైన్ ప్యాటర్న్ తో 16-ఇంచ్ అల్లాయ్స్ తో అందించబడింది.
అలాగే, సన్‌రైజ్ కాపర్ ఆరెంజ్ ఎక్ట్సీరియర్ కలర్ కారుకు కొత్తగా వచ్చింది మరియు ఇదే సిగ్నేచర్ కలర్ లాంచ్ సమయంలో కూడా కనిపించింది. ఈ కారు మోనో-టోన్ మరియు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లతో పాటుగా మొత్తం 13 కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది.
ఈ కారును మరింత దగ్గర నుంచి చూస్తే, టెయిల్‌లైట్స్ బ్లాక్ కలర్ లో ఫాగ్ తో ఉన్నట్లు మీరు గమనిస్తారు. అంతేకాకుండా, లోపల ఉన్న అంశాలన్నీ మాగ్నైట్‌ను సూచించే M షేప్ ని కలిగి ఉన్నాయి.
ఇప్పుడు, వెనుక బంపర్‌లో సిల్వర్ ఇన్‌సర్ట్ ఉంది.అయితే, నిస్సాన్ లోగో మరియు మధ్యలో ఉన్న ‘మాగ్నైట్’ బ్యాడ్జ్‌ని ఎప్పటిలాగానే ఉంచారు.
ఇంటీరియర్‌లో మరింత ప్రాముఖ్యమైన మార్పులను గమనించడానికి లోపలికి అడుగు పెట్టాల్సిందే. ఈ అప్‌డేట్ ద్వారా కొత్త రెడ్డిష్ సన్‌రైజ్ కాపర్ కలర్‌ను కలిపి త్రీ-టోన్ కలర్ సర్ప్రైజ్ అని కూడా పిలుస్తున్నారు.
డ్యాష్‌బోర్డ్ క్లీన్ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఇది 360 లెధరెట్ ట్రీట్‌మెంట్‌తో ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. సాధారణంగా, మీరు ఎక్కడ టచ్ చేసినా, లెదర్ ద్వారా చక్కని అనుభూతిని పొందుతారు.
ఇతర ఫీచర్లలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, గ్లోస్ బ్లాక్ ఇన్సర్ట్‌లతో త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ మరియు కొత్త ఫాంట్‌లతో అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి.
పవర్ ట్రెయిన్
మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్ ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న అవుట్‌గోయింగ్ మోడల్‌కు సమానమైన ఇంజిన్‌లతో అందించబడింది. ఇది నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు అలాగే, టర్బోచార్జ్డ్ 1.0-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఎఎంటితో జతచేసి పొందవచ్చు, అయితే టర్బో-పెట్రోల్ ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటిఆప్షన్ తో జతచేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్