- లేటెస్టుగా లాంచ్ అయిన స్పెషల్ ఎడిషన్
- కాస్మోటిక్ మార్పులు మరియు కొత్త ఫీచర్లను పొందిన స్నోస్టార్మ్ ఎడిషన్
ఎంజి హెక్టర్ కారు ఇండియాలో దాని ఐదవ వార్షికోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకుంటుండగా, దీనిని మరింత ఘనంగా సెలెబ్రేట్ చేసుకోవడానికి జెఎస్‍డబ్లూ ఎంజి మోటార్ ఇండియా ఒక కొత్త స్పెషల్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. దీనిని హెక్టర్ స్నోస్టార్మ్ ఎడిషన్ గా పిలుస్తుండగా, రూ.21.53 లక్షలతో దీని ఎక్స్-షోరూం ధర ప్రారంభమైంది. స్నోస్టార్మ్ వేరియంట్ ని ఫీచర్ చేసే విధంగా ఎంజి లైనప్ లో హెక్టర్ కారు రెండవ మోడల్ గా నిలిచింది. ఇప్పుడు మనం పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లలో అందించబడిన ఈ కారు ఫోటో గ్యాలరీని ఓసారి పరిశీలిద్దాం.
2024 ఎంజి హెక్టర్ స్నోస్టార్మ్ ఎడిషన్ ఫోటో గ్యాలరీ
ఇంతకు ముందు గ్లోస్టర్ లో చూసిన విధంగా, హెక్టర్ స్నోస్టార్మ్ కూడా దీని లుక్ హైలైట్ అయ్యే విధంగా బ్లాక్ రూఫ్ తో వైట్ ఎక్స్‌టీరియర్ మరియు డార్క్ క్రోమ్ యాక్సెంట్లతో వచ్చింది.
అలాగే, ఇది డైమండ్ మెష్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్ సరౌండ్, డార్క్ క్రోమ్ గార్నిష్ తో ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, మరియు పియానో బ్లాక్ హెడ్ ల్యాంప్ బెజెల్ ని కలిగి ఉంది. ఈ ఎస్‍యూవీ 18-ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ని మరియు అదేవిధంగా రెడ్ బ్రేక్ కాలిపర్స్ ని పొందింది.
బాడీ సైడ్ మౌల్డింగ్ కూడా పియానో బ్లాక్ రూఫ్ రెయిల్స్ తో డార్క్ క్రోమ్ లో ఉంది. కారు వెనుక వైపు, స్మోక్డ్ టెయిల్ లైట్స్ మరియు టెయిల్ గేట్ గార్నిష్ ని మీరు చూడవచ్చు.
ఇంటీరియర్ పరంగా, లోపల హెక్టర్ స్నోస్టార్మ్ ఎడిషన్ కారు గన్ మెటల్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ ని పొందింది. అలాగే కన్సోల్, డోర్ హ్యండిల్స్, స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ మరియు ఇతర వాటిపై గ్రే ఫినిషింగ్ ని మీరు చూడవచ్చు.
స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే, ఈ కారు ఎన్నో ఇతర ఫీచర్లను కలిగి ఉంది. అందులో 14-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్ రూఫ్ వంటివి హైలైట్లుగా నిలిచాయి.
పవర్ ట్రెయిన్
స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే, ఎంజి హెక్టర్ స్నోస్టార్మ్ ఎడిషన్లోని ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు లేవు. దీనిని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పొందవచ్చు. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్ గా లభిస్తుండగా, పెట్రోల్ ఇంజిన్ ని సివిటితో కలిపి పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్