- కొత్త స్ప్రింట్ వేరియంట్ ను పరిచయం చేసిన ఎంజి
- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చిన 2024 మోడల్ ఆస్టర్
ఎంజి ఇండియా ఎంట్రీ-లెవెల్ ఎస్‍యూవీ ఆస్టర్ ని ఇండియాలో అప్‍డేట్ చేసింది. ఇప్పుడు ఈ రీఫ్రెష్డ్ 2024 ఆస్టర్ మోడల్ రూ.9.98 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు దీనిని స్ప్రింట్(కొత్త), షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, మరియు సావీ ప్రో అనే 5 వేరియంట్లలో పొందవచ్చు.
ఫీచర్స్ పరంగా చెప్పాలంటే, అప్‍డేటెడ్ ఎంజి ఆస్టర్ ఐ-స్మార్ట్ 2.0, 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్, జియో-బేస్డ్ వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ మరియు యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌తో కూడిన డిజిటల్ కీ ఫంక్షన్లతో లోడ్ చేయబడింది. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్)సూట్ వంటి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
మెకానికల్ గా, ఈ ఆటోమేకర్ ఆస్టర్ యొక్క పవర్ ట్రెయిన్స్ ని ఏమాత్రం మార్చకుండా 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ అనే పవర్ ట్రెయిన్లను 2024 మోడల్ ఆస్టర్ లో కూడా కొనసాగిస్తుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్, సివిటి, మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
లాంచ్ పై ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ “మా ఉత్పత్తులతో సరికొత్త ఆటోమొబైల్ టెక్నాలజీని ప్రదర్శించి కస్టమర్ల అంచనాలను అందుకోవడానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాము. దానికి అనుగుణంగా, ఎంజి బ్రాండ్ ఈ సంవత్సరం తన శతాబ్ది వేడుకలను జరుపుకుంటూఆస్టర్ 2024 లైనప్ ఫీచర్స్, డిజైన్ మరియు గొప్ప విలువ ప్రతిపాదనల కలయికను అందిస్తుంది, ఇది ఎంజి కారును కొనుగోలు చేసే కస్టమర్లను ఈ లాంచ్ మరింత ఆనందపరుస్తుందని భావిస్తున్నాము.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్