- ప్రత్యేకమైన అంశాలతో వచ్చిన స్పెషల్ ఎడిషన్
- లిమిటెడ్ ఎడిషన్ గా కస్టమర్లకు లభిస్తున్న మోడల్
ఎంజి మోటార్స్ పండుగ సీజన్ సందర్భంగా ఇండియాలో లేటెస్టుగా ఆస్టర్ మరియు హెక్టర్ మోడల్స్ లో స్పెషల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఆస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కారు రూ.13.45 లక్షల ఎక్స్-షోరూం ధరతో లభిస్తుండగా, దీనిని ఆన్ లైన్ లేదా బ్రాండ్ అధికారిక డీలర్ షిప్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త స్పెషల్ ఎడిషన్ కారు ఎన్నో కాస్మోటిక్ అప్ డేట్లను పొందగా, ఇది తక్కువ సంఖ్యలో లిమిటెడ్ ఎడిషన్ గా కస్టమర్లకు లభించనుంది. బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ద్వారా ఆస్టర్ ఎస్‍యూవీలో చోటుచేసుకున్న మార్పులను మరియు హైలైట్ అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఎంజి ఆస్టర్ బ్లాక్ స్టార్మ్ ఫోటో గ్యాలరీ
ఇతర స్పెషల్ ఎడిషన్ల లాగే, ఎంజి ఆస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ చిన్నపాటి మార్పులను పొందింది. అందులో ఆల్-బ్లాక్ బ్లాక్ హనీకోమ్బ్ గ్రిల్, అలాగే, బ్లాక్ ఫినిషింగ్ తో హెడ్ ల్యాంప్స్ మరియు బంపర్స్ ని పొందింది.
డోర్ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్, మరియు డోర్ గార్నిష్ కూడా స్పోర్ట్ లుక్ ని అందించేలా బ్లాక్ ఫినిషింగ్ ని కలిగి ఉంది. ఈ ఎస్‍యూవీ స్టాండర్డ్ వేరియంట్ల లాగే ఒకే రకమైన అల్లాయ్ వీల్స్ ప్యాటర్న్ ని పొందింది. కానీ, బ్లాక్ ఫినిషింగ్ తో మరియు రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి.
లోపల చూస్తే, ఆస్టర్ బ్లాక్ స్టార్మ్ కారు టక్సెడో బ్లాక్ అప్హోల్స్టరీ హైలైట్ గా కనిపిస్తుంది. దీంతో పాటుగా స్టీరింగ్ వీల్ మరియు డోర్ ట్రిమ్స్ రెడ్ స్టిచింగ్ ని కూడా కలిగి ఉంది.
ఇంకా చెప్పాలంటే, ఈ కారులో సంగ్రియా రెడ్ థీమ్డ్-ఏసీ వెంట్లు ఉండగా, ఫ్రంట్ సీట్ హెడ్ రెస్ట్స్ పై “బ్లాక్ స్టార్మ్” అనే రెడ్ ఎంబ్రాయిడరీని కలిగి ఉంది. అలాగే, ఈ ఎస్‍యూవీలో జెబిఎల్ స్పీకర్లు, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), మరియు డిజిటల్ కార్ కీ వంటివి ఉన్నాయి.
పవర్ ట్రెయిన్
అస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లోని అందించబడిన పవర్ ట్రెయిన్లలో ఎలాంటి మార్పులు చేయబడలేదు. ఎంజి ఆస్టర్ కారును 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 1.3-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో పొందవచ్చు. మొదటి ఇంజిన్ 108bhp మరియు 144Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి యూనిట్ తో అందించబడింది. రెండవ ఇంజిన్ అయిన టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 138bhp మరియు 220Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ తో మాత్రమే అందించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్