- సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభ్యం
- కొత్త S63 ఎఎంజి E-పెర్ఫార్మెన్స్ తో పాటుగా లాంచ్ అయిన కొత్త మోడల్
మెర్సిడెస్-బెంజ్ 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600మరియు S63 ఎఎంజి E-పెర్ఫార్మెన్స్ అనే లగ్జరీ కార్లను లాంచ్ చేయడం ద్వారా దాని టాప్-ఎండ్ వెహికిల్ రేంజ్ లిస్టులోకి రెండు కొత్త మోడళ్లను జతచేసింది. మొదట పేర్కొన్న 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600మోడల్ ని రూ.3.35 కోట్ల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో మెర్సిడెస్-బెంజ్ పరిచయం చేసింది.
కొత్తగా లాంచ్ అయిన మోడల్ ఫోటోలను చూస్తే, 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600 మోడల్ వర్టికల్ స్లాట్స్ తో సిగ్నేచర్ గ్రిల్ ని పొందగా, ఇది క్రోమ్ ఫినిష్ ని పొందింది, అలాగే ఇది ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రీఫ్రెష్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్స్, మరియు ఫ్రెష్ సెట్ తో కూడిన 22-ఇంచ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను పొందింది.
లోపల చూస్తే, కొత్త మెర్సిడెస్-మేబాక్ GLS 600 మోడల్ బర్మెస్టర్-బేస్డ్ సరౌండ్ సౌండ్ మ్యూజిక్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అకౌస్టిక్ కంఫర్ట్ ప్యాకేజీ, కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్ మరియు కారులో రెండవ వరుస వరకు పొడిగించి ఉన్న సెంటర్ కన్సోల్ వంటి వాటిని కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, షాంపేన్ ఫ్లూట్స్ తో ఇంటిగ్రేటెడ్ ఫ్రిడ్జ్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్స్, పార్కింగ్ అసిస్ట్, లేటెస్ట్-జెన్ ఎంబియుఎక్స్ సిస్టమ్ మరియు మరెన్నో అద్బుతమైన ఫీచర్లను పొందింది. కస్టమర్లు వారి కార్లను మానుఫాక్టర్ ఆప్షన్స్ సహాయంతో అదనంగా కస్టమైజ్ కూడా చేయవచ్చు.
కారులో ముఖ్య భాగమైన ఇంజిన్ విషయానికి వస్తే, 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600 మోడల్ 557bhp మరియు 730Nm టార్కును ఉత్పత్తి చేయడానికి 4.0-లీటర్, ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. అలాగే, 48V మైల్డ్-హైబ్రిడ్ మోటార్ అదనంగా 22bhp/250Nm టార్కు అవుట్ పుట్ ని జనరేట్ చేస్తుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సు ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్