- డీజిల్ మరియు పెట్రోల్ పవర్ రెండింట్లో అందుబాటులోకి వచ్చిన జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్
- త్వరలో ప్రారంభంకానున్న మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ డెలివరీ
ముందుగా మనం ఊహించిన విధంగానే 2024మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ ఇండియాలో రూ. 1.32 కోట్లతో లాంచ్ అయింది. ఇది థర్డ్-జెన్ జిఎల్ఎస్ కు మిడ్-లైఫ్ అప్‍డేట్ కాగా, ప్రస్తుతం ఇది కాస్మోటిక్ మరియు ఫీచర్ అప్‍డేట్స్ తో వచ్చింది. ఇది వరకే ఈ అప్‍డేటెడ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ ని మేము డ్రైవ్ చేశాము, దానికి సంబంధించిన రివ్యూను మీరు ఇక్కడ చూడవచ్చు.
ఎక్స్‌టీరియర్ పరంగా, అప్‍డేటెడ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ కొత్త డిజైన్ తో అల్లాయ్ వీల్స్, కొత్త గ్రిల్, బంపర్స్, మరియు కొత్త డిజైన్ తో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ లైట్ ప్యాటర్న్ ను పొందనుంది. ఎక్స్‌టీరియర్ పరంగా, లోపల కొత్త స్టీరింగ్ వీల్, కొత్త ఎంబియుఎక్స్ ఇంటర్ ఫేస్, మరియు ఫింగర్ ప్రింట్ టెలిమాటిక్స్ సెన్సార్ ను జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ కి జత చేసింది. ఈ ఫుల్లీ లోడెడ్ మెర్సిడెస్ ఎస్‍యూవీలో మీరు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ డిజిటల్ డిస్ ప్లే, లెదర్ అప్‍హోల్స్టరీ, మసాజ్ ఫంక్షన్ తో పవర్డ్ సీట్స్, వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, మరియు 3 ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ ని పొందుతారు. కొలతల పరంగా, ఈ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ 5.1 మీటర్ల పొడవు ఉండగా, అందులో 3 మీటర్లకు పైగా వీల్ బేస్ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్ లో మూడవ వరుసను సరిగా ఉపయోగించుకునేలా ఉన్న కార్లలో ఇది ఒకటిగా ఉంది.
ఈ ఫుల్లీ లోడెడ్ మెర్సిడెస్ ఎస్‍యూవీలో మీరు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ డిజిటల్ డిస్ ప్లే, లెదర్ అప్‍హోల్స్టరీ, మసాజ్ ఫంక్షన్ తో పవర్డ్ సీట్స్, వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, మరియు 3 ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ ని పొందుతారు. కొలతల పరంగా, ఈ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ 5.1 మీటర్ల పొడవు ఉండగా, అందులో 3 మీటర్లకు పైగా వీల్ బేస్ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్ లో మూడవ వరుసను సరిగా ఉపయోగించుకునేలా ఉన్న కార్లలో ఇది ఒకటిగా ఉంది.
అప్‍డేటెడ్ మెర్సిడెస్ జిఎల్ఎస్ ఎస్‍యూవీని 400d వేరియంట్లో 362bhp/750Nm టార్కును ఉత్పత్తి చేసే 3.0-లీటర్ ఇన్ లైన్ 6-స్పీడ్ డీజిల్ ఇంజిన్ తో లేదా 375bhp/500Nmటార్కును ఉత్పత్తి చేసే 3.0-లీటర్ ఇన్ లైన్ 6-స్పీడ్ పెట్రోల్ ఇంజిన్ తో పొందవచ్చు. అదే విధంగా ఈ రెండు ఇంజిన్లు 48V మైల్డ్- హైబ్రిడ్ టెక్నాలజీ, ఏడబ్ల్యూడీ, మరియు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ని పొందుతాయి. అలాగే వివిధ డ్రైవ్ మోడ్స్ తో పాటు, మీరు ఆఫ్-రోడ్ లో ప్రయాణం చేస్తున్నపుడు బానెట్ మరింత పారదర్శకంగా కనిపించడానికి వీటి ఫీచర్లను మెర్సిడెస్ మెరుగుపరించింది. అలాగే, ఇది కేవలం 6.1 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని చాలా ఈజీగా అందుకోగలదు.
పోటీపరంగా, మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఎస్‍యూవీ బిఎండబ్ల్యూ X7, ఆడి Q8, రేంజ్ రోవర్ స్పోర్ట్, మరియు వోల్వో XC90 మోడల్స్ వంటి బలమైన ప్రత్యర్థులతో పోటీ పడుతుంది.
2024మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ ధరలు ఇలా ఉన్నాయి:
2024 మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ 450 4మాటిక్- రూ.1.32 కోట్లు
2024 మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ 450d 4మాటిక్- రూ. రూ.1.37 కోట్లు
అనువాదించిన వారు: సంజయ్ కుమార్